Yograj Singh : చనిపోవడానికి సిద్ధంగా ఉన్నా..  యువరాజ్ సింగ్ తండ్రి సంచలన ఆరోపణలు!

తన జీవితం ముగిసిపోయిందని, చావడానికి సిద్ధంగా ఉన్నానంటూ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ సంచలన కామెంట్స్ చేశారు. ఆహారం కోసం ఇతరులపై ఆధారపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

New Update
yogaraj singh

తన జీవితం ముగిసిపోయిందని, చావడానికి సిద్ధంగా ఉన్నానంటూ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ సంచలన కామెంట్స్ చేశారు. తన స్వగ్రామంలో భార్య, పిల్లలకు దూరంగా ఉండటం వలన ఒంటరిగా గడుపుతున్నానని, ఆహారం కోసం ఇతరులపై ఆధారపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను కుటుంబాన్ని ప్రేమిస్తానని, ఎవరినీ సాయం అడగనన్నారు యోగ్‌రాజ్ సింగ్. 

ఎవరికీ ఎలాంటి అపకారం చేయలేదు

తాను కొన్ని తప్పులు చేసి ఉండొచ్చని, కానీ ఎవరికీ ఎలాంటి అపకారం చేయలేదని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. వృద్ధాప్యంలో ఎవరూ తోడుగా లేరని వాపోయారు.  దేవుడు ఎప్పుడు తనను తీసుకెళ్లాలనుకుంటే అప్పుడు తీసుకెళ్లవచ్చని పేర్కొన్నారు.తన తల్లి, పిల్లలు, కోడలు, మనవరాళ్లు... కుటుంబంలో అందరినీ ప్రేమిస్తానని, కానీ వారి నుంచి తాను ఏమీ ఆశించడం లేదని ఆయన స్పష్టం చేశారు. 

తన జీవితంలో అత్యంత బాధ కలిగించిన విషయం తన మొదటి భార్య షబ్నమ్ కౌర్, కొడుకు యువరాజ్ సింగ్  తనను విడిచి వెళ్లిపోవడమేనని యోగ్రాజ్ సింగ్ అన్నారు. "ఎవరి కోసం నా జీవితాన్ని అంకితం చేశానో, వారే నన్ను వదిలి వెళ్లడం నాకు అతిపెద్ద షాక్," అని కన్నీటిపర్యంతమయ్యారు. వృద్ధాప్యంలో ఒంటరి జీవితాన్ని గడుపుతున్న యోగ్రాజ్ సింగ్ ఈ వ్యాఖ్యలు అభిమానులను కలచివేశాయి. 

ఆయన మళ్ళీ క్రికెట్ కోచింగ్‌లో చురుకుగా పాల్గొంటున్నారు. కాగా యువరాజ్ క్రికెట్ కెరీర్ అసంతృప్తికరంగా ముగియడానికి మాజీ భారత కెప్టెన్ ఎంఎస్ ధోనీ కారణమని యోగరాజ్ గతంలో కీలక కామెంట్స్ చేశారు. 

Advertisment
తాజా కథనాలు