/rtv/media/media_files/2025/09/20/sridhar-babu-donald-trump-2025-09-20-18-34-38.jpg)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H1B వీసా ఛార్జీలను పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. H1B VISA పై ఛార్జీలను పెంచడాన్ని తెలంగాణ ప్రభుత్వం ఖండిస్తుందన్నారు. భారత దేశానికి నష్టం జరిగేలా అమెరికా నిర్ణయాలు ఉంటున్నాయన్నారు. చిన్న చిన్న వ్యాపారాలు నడిపిస్తున్న వారికి అమెరికా నష్టం కలిగించే నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. అమెరికా నిర్ణయాలపై భారత ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుంది? అని ప్రశ్నించారు. లక్ష డాలర్లు కట్టాలని అమెరికా రూల్ తెస్తే అమెరికాలో ఇండియా కంపెనీలకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. H1B వీసాల జారీలో మొదటి స్థానంలో ఇండియా, తర్వాత చైనా ఉందన్నారు. ట్రంప్ నిర్ణయాలపై కేంద్రం సైలెంట్ గా ఉండడం సరికాదన్నారు.
అమెరికా తీసుకుంటున్న అనేక నిర్ణయాల వల్ల మా ప్రభుత్వంపై ప్రభావం పడుతుంది
— Telugu Scribe (@TeluguScribe) September 20, 2025
దీని గురించి ఆలోచించే తీరిక కేంద్ర ప్రభుత్వానికి లేదా? – మంత్రి శ్రీధర్ బాబు pic.twitter.com/9QGZc3js73
అమెరికా నిర్ణయాల వల్ల మన దేశ పౌరులకు నష్టం జరిగినా ఎందుకు ఒత్తిడి తేవడం లేదని ప్రశ్నించారు. H1B VISA దారులకు తాత్కాలిక ఉపశమనం కలిగే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి అమెరికాలో చాలా మంది ఉన్నారన్నారు. TCS నుంచి లక్ష మంది, విప్రో 80 వేలు, ఇన్ఫోసిస్ 60 వేల మంది అమెరికాలో ఉన్నారన్నారు. ట్రంప్ నిర్ణయం టాలెంట్ కు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం అంటూ అక్కడ వ్యాపారవేత్తలు వ్యతిరేకిస్తున్నారన్నారు. ట్రంప్ నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం దౌత్యపరంగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. దౌత్యపరంగా సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోతే ఇండియాకు నష్టం జరుగుతుందన్నారు.
తెలుగు రాష్ట్రాలకు పెను ప్రమాదం..
ట్రంప్ నిర్ణయం వల్ల తెలుగు రాష్ట్రాలకు పెద్ద ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా వెళ్లాలనే యువతకు ట్రంప్ నిర్ణయం పెనుభారమని అన్నారు. ట్రంప్ నిర్ణయం వల్ల ఆర్థిక వ్యవస్థ పై ప్రభావం పడుతుందన్నారు. రియల్ ఎస్టేట్, బంగారం కొనుగోలు, ఇతరుల రంగాల్లో భారం పడుతుందన్నారు. ట్రంప్ నిర్ణయం పట్ల కేంద్రంలోని మోదీ మౌనం వెనుక ఉన్న అంతర్యం ఏంటి? అని ప్రశ్నించారు. మోదీ-ట్రంప్ స్నేహం బాగుందని బీజేపీ నేతలు అంటారని.. మరి నిర్ణయాలు ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. చిన్న, మధ్యతరగతి కంపెనీల గురించి కేంద్రం ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలన్నారు. అమెరికాతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని కోరారు.
ఇదిలా ఉంటే.. H1-B వీసాలపై ట్రంప్ లక్ష డాలర్ల రుసుంపై ప్రధాని మోదీ స్పందించారు. విదేశాలపై ఆధారపడడం పెద్ద శత్రువు అని అన్నారు. తాను ఎప్పటి నుంచో ఈ విషయాన్ని చెబుతున్నానన్నారు. మన దేశాన్ని బలమైన ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు కృషి చేయాలన్నారు. ఆత్మాభిమానంతో బతుకుదామని పిలుపునిచ్చారు. మన దేశంలోని 140 కోట్ల మంది ప్రజల భవిష్యత్‌ను ఇతర దేశాల మీద వదిలేయబోంమన్నారు మోదీ.