/rtv/media/media_files/2025/02/22/naNAwAwUCz59yOO0gJbc.jpg)
shikhar
టీమిండియా (Team India) మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) పర్సనల్ లైఫ్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ మాజీ క్రికెటర్ కొత్త గర్ల్‌ఫ్రెండ్‌తో చక్కర్లు కొడుతున్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ సమయంలో.. ప్రేక్షకుల గ్యాలరీతో కొత్త గర్ల్‌ఫ్రెండ్‌తో ధావన్ కనిపించాడు.
పర్సనల్ లైఫ్‌లో బిజీ...
తన పక్క చైర్‌లో కూర్చున్న ఆమె ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నది. అయితే ఆమె వివరాలు ఏంటని నెట్ యూజర్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. మూడేళ్ల క్రితం ఆస్ట్రేలియా మహిళకు విడాకులు ఇచ్చిన ధావన్ మళ్లీ పర్సనల్ లైఫ్‌లో బిజీ అయినట్లు నెటిజన్లు భావిస్తున్నారు.
Also Read: Trump-Musk:మస్క్ కుమారుడి అల్లరి వల్ల 145 సంవత్సరాల డెస్క్ మార్చేసిన ట్రంప్!
శిఖర్ ధావన్‌తో ఉన్న ఆ మిస్ట్రీ అమ్మాయి పేరును సోఫీ షైన్ (Sophie Shine) గా గుర్తించారు. ఆమె ఐర్లాండ్ దేశస్థురాలు అని తెలిసింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను ధావన్ ఫాలో అవుతున్నట్లు ఆన్‌లైన్ యూజర్లు గుర్తించారు. sophieshine93 యూజర్ నేమ్‌తో ఆమె అకౌంట్ ఉన్నది. అయితే సోఫీ ప్రొఫైల్ ప్రైవేట్ కావడం వల్ల ఆమె ఫోటోలు ఎవరికీ లభించడంలేదు. ప్రోడక్ట్ కన్సల్టెంట్‌గా సోఫీ పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఇద్దరు కలిసి బంగ్లాదేశ్ మ్యాచ్ వీక్షిస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతున్నాయి.
भारत बांग्लादेश मैच के दौरान वापसी करते शिखर धवन 🤦🏻♂️#ShikarDhawan pic.twitter.com/4HLmFL6biK
— Amoxicillin (@__Amoxicillin_) February 21, 2025
వాస్తవానికి ధావన్, సోఫీ మధ్య ఉన్న రిలేషన్ ఏంటన్న విషయం ఇంకా స్పష్టంగా తెలియదు. కానీ ఇద్దరి మధ్య డేటింగ్ నడుస్తున్న అనుమానాలు మాత్రం వ్యాపిస్తున్నాయి. అయితే ఆ ఇద్దరూ గతంలో ఓ సారి విమానాశ్రయంలో కనిపించారు. ముంబైలో ఆ ఇద్దరూ తమ కారు నుంచి దిగి వెళ్తున్న సమయంలో ఫోటోగ్రాఫర్లు వీరిని గుర్తించారు. కానీ అధికారికంగా వాళ్ల రిలేషన్ ఏంటన్న విషయం మాత్రం ఇంకా స్పష్టంగా తెలియదు.
Also Read: Maha Kumbh Mela: కుంభమేళాలో డిజిటల్ స్నానం...కేవలం 1100 లే..అదిరిపోయింది కదా ఐడియా!