Trump-Musk:మస్క్‌ కుమారుడి అల్లరి వల్ల 145 సంవత్సరాల డెస్క్‌ మార్చేసిన ట్రంప్‌!

ఓవల్‌ ఆఫీస్‌ లో 145 ఏళ్ల పురాతన రెజల్యూట్‌ డెస్క్‌ ను ట్రంప్‌ తీయించేశారు. మస్క్ కొద్దిరోజుల క్రితం తన నాలుగేళ్ల కుమారుడితో కలిసి ట్రంప్ ను కలిశారు. ఆ సమయంలో మస్క్ కుమారుడు చేసిన అల్లరి వల్లే టేబుల్‌ ను మార్చినట్లు తెలుస్తుంది.

New Update
musk

musk

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కొద్దిరోజుల క్రితం తన నాలుగేళ్ల కుమారుడితో కలిసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ను కలిసిన సంగతి తెలిసిందే. వైట్‌ హౌస్‌ లోని ఓవల్‌ ఆఫీస్‌ లో వీరిద్దరూ మీడియా సమావేశంలో పాల్గొనగా..మస్క్‌ కుమారుడి అల్లరి నెటిజన్ల  దృష్టిని ఆకర్షించింది. ఆ చిన్నారి వల్ల ట్రంప్‌ ఇప్పుడు తన డెస్క్‌ ను మార్చుకోవాల్సి వచ్చిందట.

Also Read: Yadagiri Gutta: స్వర్ణ విమాన గోపురం రికార్డు.. దేశంలోనే మొట్టమొదటిదిగా యాదగిరిగుట్ట ఆలయం రికార్డు!

ఓవల్‌ ఆఫీస్‌ లో 145 ఏళ్ల పురాతన రెజల్యూట్‌ డెస్క్‌ ను తీసేయించిన ట్రంప్‌..దాని స్థానంలో  సీ ఆండ్‌ ఓ డెస్క్‌ ను పెట్టించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయన తన ట్రూత్‌ ఖాతాలో పంచుకున్నారు. అయితే ఇది తాత్కాలిక మార్పేనని ఆయన పేర్కొన్నారు.

Also Read: Maha Kumbh Mela: కుంభమేళాలో డిజిటల్ స్నానం...కేవలం 1100 లే..అదిరిపోయింది కదా ఐడియా!

7 డెస్కుల్లో ఏదో ఒకదాన్ని...

మస్క్‌ కుమారుడు ఆ టేబుల్‌ పై చేతులు పెట్టడం, రుద్దడం వంటి పనులు చేశాడు. బ్యాక్టీరియా భయంతో అతి శుభ్రతను పాటించే ట్రంప్‌...చిన్నారి చేష్టల కారణంగానే టేబుల్‌ ను మార్చినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ మార్పు పై ట్రంప్‌ పోస్ట్‌ చేస్తూ..శ్వేత సౌధంలోని 7 డెస్కుల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకునే అవకాశం అధ్యక్షుడికి ఉంటుంది.

ఈ సీ అండ్‌ ఓ డెస్క్‌ ను గతంలో జార్జ్‌ బుఫ్‌, మరికొందరు అధ్యక్షులు ఓవల్‌ ఆఫీస్‌ లో వినియోగించారు. ఇప్పటి వరకు ఇక్కడున్న రెజల్యూట్‌ డెస్క్‌ ను మరమ్మతుల కోసం పంపించాం. అది చాలా అత్యవసరం అని రాసుకొచ్చారు. ఈ రెజల్యూట్‌ డెస్క్‌ ను 1880 లో అప్పటి బ్రిటన్ రాణి క్వీన్‌ విక్టోరియా..నాటి అమెరికా అధ్యక్షుడు రూథర్‌ ఫోర్డ్‌ కు కానుకగా ఇచ్చారు.

దీన్ని బ్రిటీష్‌ రాయల్‌ నేవీలో సేవలందించి వైదొలిగిన హెచ్‌ఎంసెస్‌ రెజల్యూట్‌ అనే నౌక చెక్కతో తయారుచేశారు.గతవారం మస్క్‌ శ్వేతసౌధానికి వచ్చి అధ్యక్షుడు ట్రంప్‌ తో సమావేశమయ్యారు. ఆ సమయంలో కుమారుడు ఎక్స్‌ ఏఈఏ క్స్జి కూడా వెంటే ఉన్నాడు. మస్క్‌ మీడియాతో మాట్లాడుతుండగా ఈ పిల్లాడు చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. తండ్రి తల పై ఎక్కి కూర్చున్న దృశ్యాలు నెట్టింట వైరల్‌ గా మారాయి.

Also Read: Viral News:రిసెప్షన్‌కు ముందు బ్యూటీపార్లర్‌కు వెళ్లొస్తానని..ప్రియుడితో జంప్‌ అయిన నవవధువు!

Also Read: MK Stalin:దేని మీద రాళ్లు రువ్వుతున్నారో గమనించుకోండంటూ స్టాలిన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు