Yadagiri Gutta: స్వర్ణ విమాన గోపురం రికార్డు.. దేశంలోనే మొట్టమొదటిదిగా యాదగిరిగుట్ట ఆలయం రికార్డు!

యాదగిరిగుట్ట దేవస్థాన గోపురం రికార్డుకెక్కింది. దేశంలో ఎత్తైన స్వర్ణ గోపురంగా యాదగిరిగుట్ట ఆలయ గోపురం నిలవటం విశేషం.స్వర్ణ విమాన గోపుర మహా కుంభాభిషేకానికి హాజరుకావాలని సీఎం రేవంత్ , మాజీ సీఎం కేసీఆర్‌ను ఆలయ అర్చకులు ఇప్పటికే ఆహ్వానించారు.

New Update
Yadadri

Yadadri Photograph: (Yadadri)

తెలంగాణ (Telangana) ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట (Yadagiri Gutta) శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 23వ తేదీన దేవస్థాన స్వర్ణ విమాన గోపురానికి మహా కుంభాభిషేకం జరపనున్నారు. ఈ కార్యక్రమానికి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని ఆలయ పూజారులు ఆహ్వానించగా.. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కి  కూడా ఆహ్వానం అందజేశారు.  శుక్రవారం యాదగిరిగుట్ట దేవస్థానం ప్రధాన పూజారి, ఆలయ కార్యనిర్వహణ అధికారులతో కూడిన బృందం ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్‌ను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. 

Also Read: Maha Kumbh Mela: కుంభమేళాలో డిజిటల్ స్నానం...కేవలం 1100 లే..అదిరిపోయింది కదా ఐడియా!

మార్చి 1 నుంచి 11 వరకు జరిగే యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు సైతం హాజరు కావాల్సిందిగా కేసీఆర్‌ను ఆలయ పూజారులు కోరారు.అయితే.. కేసీఆర్ హయాంలో యాదగిరిగుట్టను పునర్మిర్మాణం చేసి.. అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన విషయం తెలిసిందే. కాగా.. ఆలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం పనులను కేసీఆర్ హయాంలోనే మొదలు పెట్టగా.. ఆ పనులు ఇప్పుడు పూర్తయ్యాయి. కాగా.. ఈ నెల 23న స్వర్ణ విమాన గోపురానికి మహాకుంభాభిషేకం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

Also Read: Viral News:రిసెప్షన్‌కు ముందు బ్యూటీపార్లర్‌కు వెళ్లొస్తానని..ప్రియుడితో జంప్‌ అయిన నవవధువు!

గోపురం విశేషాలివే..

స్వర్ణ విమాన గోపురం ఎత్తు 50.5 అడుగులు కాగా.. గోపురం వైశాల్యం 10,759 చదరపు అడుగులు అని ఆలయాధికారులు తెలిపారు. గోపురానికి స్వర్ణతాపడానికి మొత్తంగా 68 కిలోల బంగారాన్ని ఉపయోగించారు. డిసెంబరు ఒకటో తేదీ, 2024లో స్వర్ణ తాపడం పనులు ప్రారంభించగా.. ఫిబ్రవరి 18, 2025న తాపడం కవచాల బిగింపు పనుల పూర్తయ్యాయి. అయితే.. బిగింపు పనులకు అయిన ఖర్చు మాత్రం.. రూ.5.10 కోట్లు. రాగి రేకులకు అయిన ఖర్చు రూ.12 లక్షలు. మొత్తంగా.. సుమారు రూ.70 కోట్ల వరకు ఖర్చయినట్టు అధికారులు అంచనా వేశారు. దేశంలోనే మొట్టమొదటి ఎత్తైన స్వర్ణ గోపురంగా రికార్డుకెక్కటం గమనార్హం.

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం (Yadagiri Gutta Lakshmi Narasimha Swamy Temple) బంగారు విమాన గోపుర మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో పాల్గొనాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డికి.. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, దేవాదాయ శాఖ కార్యదర్శి శైలజా రామయ్యర్, ఆలయ ఈవో, అర్చకులు.. గురువారం ఆహ్వాన పత్రికను అందించారు. ఈ నెల 23న శ్రీ లక్ష్మీ నరసింహ దేవస్థానంలో బంగారు స్వర్ణ గోపురం మహా కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. వానమామలై మఠం 31వ పీఠాధిపతి రామానుజ జీయర్‌స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ మహోత్సవం నిర్వహించనున్నారు.

Also Read: Holidays: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త...ఇకపై ప్రతి నెలా నాలుగో శనివారం సెలవు

Also Read: Horoscope: ఈరోజు ఈ రాశివారు డబ్బు నష్టపోయే అవకాశాలున్నాయి..జాగ్రత్త!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు