/rtv/media/media_files/2026/03/01/pv-sindhu-2026-03-01-07-45-59.jpg)
దుబాయ్‌లో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్ విజేత పి.వి. సింధు దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. మంగళవారం (మార్చి 3) నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు సింధు తన టీమ్‌తో కలిసి లండన్ వెళ్తుండగా ఈ అంతరాయం ఏర్పడింది. ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం ముదరడంతో గల్ఫ్ దేశాల్లో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో సింధు దుబాయ్ విమానాశ్రయంలోనే ఉండిపోవాల్సి వచ్చింది.
It’s hard to process what’s unfolding right now. Hearing the interceptions overhead and seeing how quickly everything has escalated is honestly terrifying. So many disturbing videos are coming to light, and this is sadly the reality of what is happening. Dubai is a city I deeply…
— Pvsindhu (@Pvsindhu1) February 28, 2026
పరిస్థితి భయంకరంగా ఉంది
విమానాశ్రయంలో వేలాది మంది ప్రయాణికులతో నిండిపోయిన దృశ్యాలను సింధు సోషల్ మీడియాలో పంచుకున్నారు. "పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఆకాశంలో క్షిపణులను అడ్డుకుంటున్న శబ్దాలు వినిపిస్తున్నాయి. ఎంతో ఇష్టమైన దుబాయ్ నగరం ఇలా యుద్ధ నీడలో ఉండటం బాధాకరం. ఎన్నో కుటుంబాలు ఎక్కడికక్కడ ఆగిపోయి, ఎప్పుడు ఇంటికి వెళ్తామా అని ఎదురుచూస్తున్నారు.
ఈ కష్టకాలం త్వరగా గడిచిపోవాలని మేమంతా కోరుకుంటున్నాం. మన జీవితాలు ఎంత సున్నితమైనవో ఇలాంటి సమయాల్లోనే అర్థమవుతుంది. ఈ యుద్ధం వల్ల ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలని, త్వరగా శాంతి నెలకొనాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. నేను, నా టీమ్ ప్రస్తుతం సురక్షితంగానే ఉన్నాము" అని ఆమె ఎక్స్ (X) వేదికగా వెల్లడించారు.
ప్రస్తుతం ఎయిర్ ఇండియా సహా పలు అంతర్జాతీయ విమాన సంస్థలు గల్ఫ్ దేశాలకు సర్వీసులను రద్దు చేశాయి. దుబాయ్ ఎయిర్‌పోర్ట్ కార్యకలాపాలు నిరవధికంగా నిలిచిపోవడంతో సింధు టోర్నీలో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది.
Follow Us