Sachin: రఫ్పాడించిన సచిన్.. 52 ఏళ్ల వయసులో ఇదేం కంబ్యాక్ సామీ- మాస్ షాట్లతో ఫుల్ మజా!

సచిన్ టెండూల్కర్ మరోసారి బ్యాట్ పట్టి గ్రౌండ్‌లోకి దిగాడు. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ20లో ఇంగ్లాండ్ మాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అదరగొట్టేశాడు. వరుసగా సిక్స్, రెండు ఫోర్లతో దుమ్ము దులిపేశాడు. ఈ మ్యాచ్‌లో 21 బంతుల్లో 34 పరుగులు చేశాడు.

New Update
sachin tendulkar viral shorts in international masters t20 league 2025

sachin tendulkar viral shorts in international masters t20 league 2025

Sachin: ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్ స్కిల్ ఈజ్ ఏజ్‌లెస్ అని మాట క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌కు కరెక్ట్‌గా సెట్ అవుద్ది. 52 ఏళ్ల వయసుల్లో అతడి ఆట చూస్తే మీరే ఔను అంటారు. ఇటీవల ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ 20ని ఏర్పాటు చేశారు. అందులో సచిన్ టెండూల్కర్ మెరిసాడు. అంతేకాదు.. క్రికెట్ ఫ్యాన్స్‌కు ఫుల్ జోష్ అందించాడు. ప్రస్తుతం అతడు ఇండియా మాస్టర్స్ టీమ్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. 

Also Read: బాలింతలు, గర్భిణులే టార్గెట్.. రూ.4 కోట్ల టోకరా-పట్టుబడ్డ ఏపీ సైబర్ స్కామర్స్!

సచిన్ మాస్ షాట్లు

ఇందులో భాగంగానే మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో సచిన్ అదరగొట్టేశాడు. నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్టేడియంలో ఇంగ్లండ్ మాస్టర్స్‌తో మ్యాచ్‌లో మాస్ షాట్లతో మజా తెప్పించాడు. వరుసగా ఒక సిక్స్, రెండు ఫోర్లతో ఔరా అనిపించాడు. 52 ఏళ్ల వయసులో సచిన్ షాట్లు చూసి క్రికెట్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. 

ఈ వయసులోనే ఇలాంటి షాట్లు కొడితే.. ఒకానొక సమయంలో అతడి ఆటతీరు ఎలా ఉండేదో అని.. ప్రజెంట్ జనరేషన్స్ మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. డీప్ స్క్వౌర్ లెగ్ పై నుంచి కొట్టిన సిక్స్ అయితే అబ్బో అదిరిపోయిందనే చెప్పాలి. 

Also Read: మరోసారి భారీ భూకంపం.. 6.1 తీవ్రత నమోదు- ఎక్కడంటే?

ఇక ఆ తర్వాత బాల్‌కి ఒక ఫోర్ కొట్టాడు. అక్కడితో ఆగకుండా మళ్లీ అదే జోష్‌లో ముందుకొచ్చి బౌండరీ సాధించాడు. ఆ షాట్లు చూసి సచిన్ ఫ్యాన్స్, క్రికెట్ ప్రియులు మంత్రముగ్దులైపోయారు. ఇలా ఈ మ్యాచ్‌లో సచిన్ 21 బంతుల్లో 35 రన్స్ చేశాడు. అందులో 5 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి.

Also Read: మజాకా రివ్యూ.. సందీప్‌ కిషన్‌ ఖాతాలో హిట్‌ పడిందా?

 ఇక సచిన్ మాత్రమే కాకుండా యువరాజ్ సింగ్ 27 పరుగులు చేశాడు. అలాగే గుర్‌క్రీత్ సింగ్ 63 పరుగులు చేయడంతో ఇండియా మాస్టర్స్ జట్టు ఒక్క వికెట్ నష్టానికి విజయం సాధించింది. ఇంగ్లండ్ మాస్టర్స్ జట్టు 20 ఓవర్లలో 132 పరుగులు చేయగా.. ఇండియా మాస్టర్స్ జట్టు 11.4 ఓవర్లలోనే ఛేదించి విజయం సాధించింది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు