/rtv/media/post_attachments/wp-content/uploads/2023/05/earthquake-4.webp)
Earthquake of magnitude 6.1 strikes near Indonesia Sulawesi island
Earthquake Indonesia Sulawesi island
మరోసారి భూమి కంపించింది. తరచూ ఏదో ఒక ప్రాంతంలో భూప్రకంపనలు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి భూకంపం సంభవించింది. ఇండోనేషియాలోని సులవేసి ద్వీపం సమీపంలో భూమి వణికింది. ఇండోనేషియాలోని ఉత్తర సులవేసి ప్రావిన్స్ ఆఫ్‌షోర్‌లో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ విషయాన్ని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) నివేదించింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి నష్టం కానీ, ప్రాణనష్టం కానీ జరగలేదని పేర్కొంది.
Also Read: తమిళనాడులో హిందీ భాష వివాదం.. బోర్డులపై నల్ల రంగు పూస్తున్న డీఎంకే కార్యకర్తలు
ఉదయం 6:55 గంటలకు 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. అయితే అది 6.0 తీవ్రతతో కొంచెం తక్కువ భూకంపం సంభవించిందని ఇండోనేషియా వాతావరణ సంస్థ (BMKG) తెలిపింది. అంతేకాకుండా ఈ భూకంపం సునామీని ప్రేరేపించే ముప్పు కాదని పేర్కొంది.
Also Read: మహా కుంభమేళా పై రాంగ్ న్యూస్... 140 సోషల్ మీడియా అకౌంట్ల పై కేసు నమోదు!
గతంలో ఎన్నో మరణాలు
ఇదిలా ఉంటే ఇటీవలి సంవత్సరాలలో ఈ ప్రాంతం అనేక విధ్వంసకర భూకంపాలకు గురైంది. జనవరి 2021న సులవేసిలో 6.2 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 100 మందికి పైగా మరణించారు. అలాగే వేలాది మంది నిరాశ్రయులయ్యారు. దీనికి ముందు 2018లో సులవేసిలోని పాలూలో 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపం, సునామీ కారణంగా 2,200 మందికి పైగా మరణించారు.
Also Read: అల్లు అర్జున్ అంటే పిచ్చి.. అతడితో ఆ సీన్‌లలో అయినా ఓకే: టాలీవుడ్ హీరోయిన్!
ఇక 2004లో ఆషే ప్రావిన్స్‌లో 9.1 తీవ్రతతో సంభవించిన భూకంపం భారీ సునామీని సృష్టించింది. దీని వల్ల ఇండోనేషియాలోనే 1,70,000 మందికి పైగా మరణించడం విశేషం. అయితే ఇటీవలి భూకంపం తక్షణ నష్టం కలిగించనప్పటికీ, ఇండోనేషియా అధికారులు దీని పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. భూకంప ప్రభావిత ప్రాంతాలలో నివసించేవారు అప్రమత్తంగా ఉండాలని, దేశీయ విపత్తు నిర్వహణ అధికారులు జారీ చేసిన భద్రతా ఆదేశాలను పాటించాలని ఆదేశించారు.