Danish Kaneria : భారత్ నాకు దేవాలయం.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన ప్రకటన!

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా కీలక ప్రకటన చేశాడు. భారత పౌరసత్వంపై వస్తున్న ఊహాగానాలపై స్పందించాడు.  ప్రస్తుతం తనకు భారత పౌరసత్వం తీసుకోవాలనే ఉద్దేశం లేదని స్పష్టం చేశాడు.

New Update
danish

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా(danish-kaneria) కీలక ప్రకటన చేశాడు. భారత పౌరసత్వంపై వస్తున్న ఊహాగానాలపై స్పందించాడు.  ప్రస్తుతం తనకు భారత పౌరసత్వం తీసుకోవాలనే ఉద్దేశం లేదని స్పష్టం చేశాడు. పాకిస్తాన్ తన జన్మభూమిఅయినప్పటికీ, తన పూర్వీకుల నేల అయిన భారత్ తనకు మాతృభూమి అని కనేరియా వెల్లడించాడు. భారత్‌ తనకు ఒక దేవాలయం వంటిదని పేర్కొన్నారు. ప్రస్తుతానికి తనకు భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో తనలాంటి ఎవరైనా పౌరసత్వం తీసుకోవాలని అనుకుంటే తమ లాంటి వారికి CAA (పౌరసత్వ సవరణ చట్టం) ఇప్పటికే ఉందని ఆయన తన పోస్ట్‌లో వెల్లడించారు. కాగా మోదీ సర్కార్ CAA చట్టాన్ని తీసుకువచ్చింది. CAA అంటే పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్‌ల నుండి మతపరమైన వేధింపుల కారణంగా భారత్ కు వచ్చిన ముస్లిమేతర మైనారిటీలకు పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన చట్టం.

Also Read :  జపాన్‌లో భారీ భూకంపం.. భయంతో జనం పరుగో పరుగో

రెండవ హిందూ క్రికెటర్ గా

పాకిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహించిన రెండవ హిందూ క్రికెటర్ కనేరియా..  అంతకుముందు ఆయన బంధువు అనిల్ దల్పత్  పాక్ తరపున క్రికెట్ ఆడారు. 2000 నుంచి 2010 మధ్య పాకిస్తాన్ తరపున 61 టెస్టులు, 18 వన్డేలు ఆడాడు. పాకిస్తాన్ తరపున టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన నాల్గవ ఆటగాడు దానిష్ కనేరియా. పాకిస్తాన్ తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్ బౌలర్ రికార్డు కనేరియా పేరిట ఉంది. 2010లో కనేరియాపై స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల కారణంగా ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) ఆయనపై జీవితకాల నిషేధం విధించింది. ఈ నిషేధం తర్వాత ఆయన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగిసింది. కనేరియా తన కెరీర్ సమయంలో పాకిస్తాన్ క్రికెట్ అధికారులు, బోర్డు (PCB) నుండి మతపరమైన వివక్ష, మతమార్పిడి ఒత్తిడిని ఎదుర్కొన్నట్లు పలుమార్లు బహిరంగంగా ఆరోపించారు.

Also Read :  ఉక్రెయిన్‌లో ప్రయాణికుల రైలుపై డ్రోన్లతో దాడి... బాంబుల వర్షం కురిపించిన రష్యా

Advertisment
తాజా కథనాలు