/rtv/media/media_files/2025/10/04/team-india-odi-squad-2025-10-04-15-14-56.jpg)
Team India ODI Squad
అక్టోబర్ 19వ తేదీ నుంచి టీమిండియా.. ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. అక్కడ 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్ కోసం బీసీసీఐ తాజాగా టీమిండియా స్క్వాడ్‌ను ప్రకటించింది. ఇందులో వన్డే సిరీస్, టీ20 సిరీస్‌లకు వేరు వేరు కెప్టెన్లు ఉన్నారు. అయితే ఈ సారి వన్డే సిరీస్ కెప్టెన్సీ విషయంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. సుదీర్ఘకాలం వన్డే సిరీస్‌కు కెప్టెన్సీగా వ్యవహరించిన రోహిత్ శర్మకు బీసీసీఐ బిగ్ షాక్ ఇచ్చింది.
ఈ సారి రోహిత్ స్థానంలో యువ బ్యాటర్, ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు అవకాశం ఇచ్చింది. తాజాగా రిలీజ్ చేసిన టీమిండియా వన్డే జట్టులో గిల్ పేరును కెప్టెన్‌గా ప్రకటించింది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే 2027 వన్డే ప్రపంచ కప్ ఉంది. ఆ సమయానికి యువ బ్యాటర్ గిల్‌ను అన్ని ఫార్మాలకు సిద్ధం చేయాలనే లక్ష్యంతో సెలెక్టర్లు ఉన్నట్లు సమాచారం.
కాగా ఇప్పటికే రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఆ తర్వాత టెస్ట్ ఫార్మాట్‌కు కెప్టెన్‌గా గిల్‌ను ఎంపిక చేశారు. ఇక ఇప్పుడు వన్డే ఫార్మాట్‌కు కూడా గిల్‌నే కెప్టెన్‌గా ప్రకటించడంతో అందరూ ఒకింత షాక్‌కు గురయ్యారు. ఇదిలా ఉంటే బీసీసీఐ తాజాగా ఆస్ట్రేలియా టూర్‌కు గానూ టీమిండియా వన్డే జట్టును ప్రకటించింది. ఇప్పుడు ఈ స్క్వాడ్‌లో ఎవరెవరు ఉన్నారో చూసేద్దాం.
Team India ODI Squad
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్)
రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ
శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్)
అక్షర్ పటేల్
కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్)
నితీష్ కుమార్ రెడ్డి
వాషింగ్టన్ సుందర్
కుల్దీప్ యాదవ్
హర్షిత్ రాణా
మహ్మద్ సిరాజ్
హర్ష్‌దీప్ సింగ్
ప్రసిద్ కృష్ణ
ధ్రువ్ జురేల్ (వికెట్ కీపర్)
యశస్వీ జైస్వాల్
Team India ODI Squad Against Australia....
— Adarsh Shukla 🐬 (@shukla_Adarsh13) October 4, 2025
Rohit Sharma is not going to lead India ..
Would they ask Rohit about it or BCCI directly Sacked the Sharma ..
Big question #Gill#RohitSharmapic.twitter.com/cl0Jp4SGzU
Follow Us