Ro-Ko ODI Retirement: ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. వన్డే రిటైర్మెంట్ పై రోహిత్, విరాట్ సంచనల ప్రకటన

ఆస్ట్రేలియాతో విజయం తర్వాత, ఆడమ్ గిల్‌క్రిస్ట్‌తో మాట్లాడుతూ.. రోహిత్ శర్మ ఉద్వేగానికి లోనయ్యాడు. "మేము (నేను, కోహ్లీ) మళ్లీ ఆస్ట్రేలియా గడ్డపై ఆడతామో లేదో తెలియదు, కానీ ఇక్కడ ఆడిన ప్రతి క్షణాన్ని ఆస్వాదించాం" అని రిటైర్మెంట్‌పై పరోక్షంగా మాట్లాడారు.

New Update
Ro-Ko ODI Retirement

Ro-Ko ODI Retirement

ఇవాళ సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో, ఫైనల్ మ్యాచ్(IND Vs AUS ODI Series 2025) లో రోహిత్ శర్మ(rohit-sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli) చితక్కొట్టారు. ఇద్దరూ స్టేడియంలో పరుగుల వరద పెట్టించారు. కంగారూలకు కంగారు పెట్టించారు. ఇద్దరు బ్యాట్స్ మాన్ లు తమ బ్యాట్ తో అద్భుతంగా రాణించారు. హిట్‌మ్యాన్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి సెంచరీ సాధించాడు. ఇంతలో రెండు డకౌట్‌ల తర్వాత విరాట్ కూడా అద్భుతమైన ఫామ్‌లో కనిపించాడు. అతడు 81 బంతుల్లో 74 పరుగుల బలమైన ఇన్నింగ్స్ ఆడాడు. 

Also Read :  భారత్‌లో దారుణం.. ఆసీస్ మహిళా క్రికెటర్లపై లైంగిక వేధింపులు - నిందితుడు అరెస్ట్!

Ro-Ko ODI Retirement

కోహ్లీ, రోహిత్ రెండో వికెట్‌కు 168 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇలా ఇద్దరు బలమైన భాగస్వామ్యంతో భారత్ ఘన విజయం సాధించింది. ఇక మ్యాచ్ అనంతరం రోహిత్, కోహ్లీ తమ రిటైర్మెంట్ గురించి ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ఆడమ్ గిల్‌క్రిస్ట్‌తో మాట్లాడారు. ఇక్కడ వారిద్దరూ సంచలన ప్రకటన చేశారు. తమ అద్భుతమైన ఇన్నింగ్స్‌ల తర్వాత ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు తమ అంతర్జాతీయ కెరీర్ ముగింపు గురించి, ముఖ్యంగా ఆస్ట్రేలియా పర్యటనల గురించి చేసిన వ్యాఖ్యలు అభిమానులను కాస్త కలవరపరిచాయి. 

ముందుగా రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియాకు రావడం, ఇక్కడ ఆడటం తనకు ఎప్పుడూ ఇష్టమేనని అన్నాడు. మరీ ముఖ్యంగా సిడ్నీ తన తొలి ఆస్ట్రేలియా పర్యటన జ్ఞాపకాలను గుర్తు చేస్తుందని ఎమోషనల్ అయ్యాడు. ఇక్కడ మేము ఆడిన ప్రతీ నిమిషాన్ని ఆస్వాదించామని.. అయితే మళ్లీ మేము క్రికెటర్లుగా ఆస్ట్రేలియాకు వస్తామో, లేదో తనకు తెలియదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ ప్రయాణాన్ని మాత్రం తాను ఎంతో ఎంజాయ్ చేశానని చెప్పుకొచ్చాడు. తమ ప్రదర్శనతో సంబంధం లేకుండా ఇన్నేళ్లుగా తమకు మద్దతుగా నిలిచిన ఆస్ట్రేలియా ప్రజలకు, అభిమానులకు రోహిత్ కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. ముందుగా ఆస్ట్రేలియా అభిమానులకు కోహ్లీ ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడికి వచ్చి భారీ ప్రేక్షకుల సమక్షంలో ఆడటం తమకు చాలా ఇష్టంగా ఉంటుందని అన్నాడు. ఈ దేశంలో తాము తమ అత్యుత్తమ క్రికెట్‌ను ఆడామని అన్నాడు. ఇన్నేళ్లుగా తమకు లభించిన ఆదరణకు, ఆతిథ్యానికి ధన్యవాదాలు అని కోహ్లీ పేర్కొన్నాడు. 

దీంతో ఈ ఇద్దరి సంభాషణ ఇప్పుడు వైరల్ గా మారడంతో క్రికెట్ అభిమానులు, రో-కో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ ఇద్దరు స్టార్లు ఆస్ట్రేలియా గడ్డపై చివరిసారిగా ఆడుతున్నామని పరోక్షంగా చెప్పారని పలువురు చెబుతున్నారు. చూడాలి త్వరలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేస్తారో లేదో.

Also Read :  పాకిస్తాన్ సంచలన నిర్ణయం..  వరల్డ్ కప్ నుంచి ఔట్!

Advertisment
తాజా కథనాలు