BIG BREAKING: హరీష్ రావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్!

బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావుపై ఎన్నికల సమయంలో దాఖలైన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. హరీష్ రావు పిటిషన్లో తప్పులు ఉన్నాయంటూ చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. సరైన ఆధారాలు చూపకపోవడంతో కోర్టు కొట్టివేసింది.

New Update

మాజీ మంత్రి హరీష్‌రావుకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై దాఖలైన ఎన్నికల పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ఎన్నికల సమయంలో సరైన వివరాలు వెల్లడించలేదని చక్రధర్‌గౌడ్ అనే వ్యక్తి హరీష్ రావుపై పిటిషన్ దాఖలు చేశారు. అర్హతలు, ఆస్తుల వివరాల్లో తేడాలు ఉన్నాయని ఆరోపణలు చేశారు. ఇంకా.. హరీష్‌ తన ఆస్తుల వివరాలు సరిగా వెల్లడించలేదని పేర్కొన్నారు. అయితే.. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఆ ఆరోపణలకు సరైన ఆధారాలు లేవని తేల్చింది. దీంతో పిటిషన్ ను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. 

Advertisment
తాజా కథనాలు