Virat Kohli - RCB: కింగే కింగు.. ఒకే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 3 రికార్డులు - అదరగొట్టేశాడు భయ్యా

లక్నోతో మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ 3 రికార్డులు సాధించాడు. టీ20ల్లో ఒక ఫ్రాంఛైజీ తరఫున 9000 పరుగుల మైలురాయి దాటిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. IPLలో 5సార్లు 600 పరుగులు చేసిన బ్యాటర్‌గా, అత్యధిక హాఫ్‌సెంచరీలు చేసిన ప్లేయర్‌గా రికార్డులు నెలకొల్పాడు.

New Update
rcb batter virat kohli three records in ipl 2025 against lsg

rcb batter virat kohli three records in ipl 2025 against lsg

లక్నో సూపర్ జెయిట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. దీంతో క్వాలిఫయర్ -1కు చేరుకుంది. ఈ సీజన్‌లో కింగ్ కోహ్లీ అద్భుతమైన ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. ప్రతి మ్యాచ్‌లోనూ సూపర్ ఫామ్ కొనసాగించి పరుగులు రాబడుతున్నాడు. ఇందులో భాగంగానే లక్నోతో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో అలరించాడు. అదే సమయంలో దాదాపు 3 రికార్డులను సాధించాడు. 

ALSO READ: 5వ తరం జెట్ ను అభివృద్ధి చేస్తున్న ఇండియా

టీ20ల్లో ఒక ఫ్రాంచైజీ తరఫున దాదాపు 9000 రన్స్ మైలురాయి దాటిన మొదట బ్యాటర్‌గా కింగ్ కోహ్లీ నిలిచాడు. అదే సమయంలో IPLలో 5సార్లు 600 పరుగులు చేసిన బ్యాటర్‌గానూ.. మరోవైపు అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ రికార్డులు క్రియేట్ చేశాడు. 

ALSO READ: స్టూడెంట్స్ షాక్ ల మీద షాక్ లు ఇస్తున్న ట్రంప్..వీసా ఇంటర్వ్యూలు నిలిపేయాలని  ఆదేశం

మూడు రికార్డులు ఇవే

విరాట్ కోహ్లీ T20ల్లో RCB తరఫున దాదాపు 9000కు పైగా రన్స్ చేశాడు. IPLలో 257 ఇన్నింగ్స్‌ ఆడిన విరాట్ మొత్తం 8,606 పరుగులు చేశాడు. అతడు, CLT20 (ఛాంపియన్‌ లీగ్‌ టీ20)లో 14 ఇన్నింగ్స్‌ ఆడి 424 పరుగులు చేశాడు. ఇలా మొత్తంగా ఆర్సీబీ తరఫున 271 ఇన్నింగ్స్‌లో ఆడి 9,030 రన్స్ సాధించాడు. కాగా ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్‌ శర్మ 6060 రన్స్‌‌ను కలిగి ఉన్నాడు. 

ALSO READ: ఈసారి ఆర్సీబీ కప్​ గెలుస్తుందా? చాట్​జీపీటీ ఆన్సర్‌‌కు ఫ్యాన్స్ అవాక్!

ఇక కోహ్లీ పేరిట మరో రికార్డు ఈ సీజన్‌లో.. అది కూడా లక్నోతో మ్యాచ్‌లో నమోదు అయింది. IPL చరిత్రలో 5 సార్లు 600కి పైగా పరుగులు చేసిన బ్యాటర్‌గా విరాట్ రికార్డు సృష్టించాడు. 2013, 2016, 2023, 2024, 2025 సీజన్లలో అతడు 600లకు పైగా పరుగులు రాబట్టాడు. ఈ లిస్ట్‌లో కేఎల్‌ రాహుల్ నాలుగు సార్లు, క్రిస్‌ గేల్‌ మూడు సార్లు, డేవిడ్‌ వార్నర్‌ మూడు సార్లు 600కి పైగా పరుగులు రాబట్టారు. 

మరోవైపు లక్నోతో మ్యాచ్‌లో కోహ్లీ హాఫ్‌ సెంచరీతో చెలరేగాడు. కేవలం 27 బంతుల్లో 54 పరుగులు చేశాడు. దీంతో ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఈ మేరకు డేవిడ్ వార్నర్ రికార్డును బ్రేక్ చేశాడు. డేవిడ్‌ వార్నర్‌ 62 హాఫ్‌ సెంచరీలు చేయగా.. వాటిని దాటి 63 హాఫ్ సెంచరీలతో అగ్ర స్థానంలోకి దూసుకెళ్లాడు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు