IND Vs SA: సౌతాఫ్రికా ఆలౌట్.. దుమ్ములేపిన భారత్ బౌలర్లు

భారత్, సౌతాఫ్రికా మధ్య ఇవాళ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ఆసక్తికరంగా కొనసాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా.. ఆలౌట్ అయింది. 159 పరుగులకే చేతులెత్తేసింది. ఈ మ్యాచ్‌లో బుమ్రా 5 వికెట్లతో  దుమ్ము దులిపేశాడు.

New Update
ind vs sa

ind vs sa

భారత్, సౌతాఫ్రికా మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభమైంది. ఇవాళ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ఆసక్తికరంగా కొనసాగుతోంది. మొదటి టెస్ట్‌లోనే సౌతాఫ్రికాకు బిగ్ షాక్ తగిలింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా.. తాజాగా ఆలౌట్ అయింది. 159 పరుగులకే చేతులెత్తేసింది. ఈ మ్యాచ్‌లో బుమ్రా 5 వికెట్లతో  దుమ్ము దులిపేశాడు. 

IND Vs SA First Test

మొదట టాస్ గెలిచిన సఫారీ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి రోజు టెస్ట్ మ్యాచ్‌లో సౌతాఫ్రికాకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. వరుస వికెట్ తీస్తూ పరుగులను కట్టడి చేశారు. దీంతో సౌతాఫ్రికా లంచ్ సమయానికి 27 ఓవర్లలలో 3 వికెట్లు కోల్పోయి కేవలం 105 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్‌లో సఫారీ జట్టు కెప్టెన్ బవుమా పెద్దగా ఫెర్ఫార్మ్ చేయలేకపోయాడు. 

ఆ తర్వాత కూడా భారత్ బౌలర్లు చెలరేగిపోయారు. ఇలా టీ బ్రేక్ సమయానికి 8 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. అప్పటికి 52 ఓవర్లు పూర్తయ్యాయి. ఆ సమయానికి బుమ్రా 3 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, సిరాజ్ 2 వికెట్లు, అక్షర్ పటేల్ 1 వికెట్‌ తీసుకున్నారు. ఇంకా రెండు వికెట్లు ఉన్నాయనగా.. వాటిని కూడా బుమ్రానే లాగేసుకున్నాడు. చివరి రెండు వికెట్లను బుమ్రా తీసి.. ఈ మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. 

సౌతాఫ్రికా బ్యాటర్లలో రికెల్టన్ 23 పరుగులు, మార్క్రమ్ 31 పరుగులు, వియాన్ ముల్డర్ 24 పరుగులు, టోనీ డి జోర్జీ 24 పరుగులతో పర్వాలేదనిపించారు. మిగతావారంతా చేతులెత్తేయడంతో సఫారీ జట్టు అత్యంత స్కోరుకే పరిమితమైంది. 

Advertisment
తాజా కథనాలు