Pakistan: ఇజ్జత్ తీసుకుంటున్న పాక్.. ఆసియా కప్‌ ట్రోఫీ ఎత్తుకెళ్లిన నఖ్వీకి అలాంటి సన్మానం!

ఆసియా కప్‌ విషయంలో మరోసారి పాకిస్తాన్ వక్రబుద్ధి ప్రదర్శించింది. ACC చైర్మన్ మొహ్సిన్‌ నఖ్వీకి గోల్డ్‌ మెడల్‌ ఇవ్వాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఛైర్మన్ నిర్ణయం తీసుకున్నారు.

New Update
pakisan

ఆసియా కప్‌(Asia cup 2025) విషయంలో మరోసారి పాకిస్తాన్(pakistan) వక్రబుద్ధి ప్రదర్శించింది. ACC చైర్మన్ మొహ్సిన్‌ నఖ్వీ(pcb-chief-mohsin-naqvi)కి గోల్డ్‌ మెడల్‌ ఇవ్వాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఛైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. ఆసియా కప్ ట్రోఫీ విషయంలో భారత్‌తో వివాదంలో.. నఖ్వీ ప్రదర్శించిన వైఖరికి గోల్డ్ మెడల్ ఇస్తున్నట్లు ప్రకటించారు. నఖ్వీ వైఖరి పాకిస్తాన్ గౌరవాన్ని నిలబెట్టిందని నిర్వాహకులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే గోల్డ్ మెడల్‌తో సత్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. కరాచీలో నఖ్వీ అవార్డు ప్రదానోత్సవానికి ఏర్పాట్లు చేశారు.  ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా పీపీపీ చైర్మన్ బిలావల్ భుట్టోను ఆహ్వానించారు. ఇటీవల జరిగిన ఆసియా కప్‌ ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై టీమిండియా(team-india) ఐదు వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. అయితే నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకునేందుకు బీసీసీఐ నొ చెప్పింది. దీంతో దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నుండి ఆసియా కప్ ట్రోఫీని తీసుకుని వెళ్లాడు మొహ్సిన్‌ నఖ్వీ. కప్ కావాలంటే ACC ఆఫీస్‌కు వచ్చి తీసుకోవాలంటూ ఆయన మాట్లాడారు. తాను బీసీసీఐ అధికారులకు క్షమాపణలు చెప్పానని వస్తున్న వార్తలను కూడా ఆయన ఖండించారు. అయితే నఖ్వీని ACC పదవి నుండి తొలగించాలని BCCI డిమాండ్ చేసింది.  భారత్‌తో ట్రోఫీ అప్పగింత వివాదంలో నఖ్వీ చూపిన దృఢ వైఖరికి గాను అతనికి ప్రత్యేక బంగారు పతకం ఇవ్వనున్నట్లుగా పాక్ క్రికెట్ బోర్డు డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. 

Also Read :  ENG vs SA: చూసే లోపే మ్యాచ్ అయిపోయింది.. తొలి మ్యాచ్‌లోనే ఇంగ్లాండ్ సంచలనం

Also Read :  Sky With RTV: చివర వరకు పట్టుదలతో ఆడాం...ఆసియా కప్ టోర్నీ పై ఆర్టీవీతో కెప్టెన్ స్కై స్పెషల్ ఇంటర్వ్యూ

5 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం

ఆసియా కప్ 2025 ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై 5 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.  దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా తొమ్మిదోసారి ఆసియా కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్‌ను ముందుగా బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. పాకిస్తాన్ ఓపెనర్లు సాహిబ్‌జాదా ఫర్హాన్ (57), ఫఖర్ జమాన్ (46) జట్టుకు శుభారంభం ఇచ్చారు. 113/1 తో పటిష్టంగా ఉన్న పాకిస్తాన్, భారత స్పిన్ బౌలింగ్‌ ముందు నిలబడలేకపోయింది. చివరి 9 వికెట్లను కేవలం 33 పరుగులకే కోల్పోయి, పాక్ జట్టు 19.1 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయ్యింది.147 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ కీలక సమయంలో యువ బ్యాటర్ తిలక్ వర్మ (69 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. సంజూ శాంసన్ (24), శివమ్ దూబే (33) తో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి, మరో 2 బంతులు మిగిలి ఉండగానే భారత్‌ను విజయపథంలో నడిపించాడు. తిలక్ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Advertisment
తాజా కథనాలు