PBKS VS MI: ఈరోజే క్వాలిఫయర్ 2..ఫైనల్ కు ఎవరు వెళతారు?

ఐపీఎల్ లో ఈరోజు క్వాలిఫయర్ 2 మ్యాచ్ జరగనుంది. ఇది సెమీ ఫైనల్  లాంటిది. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్, పంజాబ్ తలపడుతున్నాయి. ఈ ఇద్దరిలో ఎవరు గెలిచి ఫైనల్ కు వెళతారు? ఎవరు ఇంటికి వెళ్ళిపోతారు? 

New Update
PBKS vs MI

ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీతో తలపడేది ఎవరో ఈ రోజు తేలిపోతుంది. నేడు జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్ లో ఫైనల్ కోసం ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు మిగతా అందరినీ ఓడించుకుంటూ ఇక్కడకు వచ్చాయి. ఈ రెండిటిలో ఇప్పటికైతే ముంబై ఫేవరెట్ గా ఉంది. వరుసగా ఐదు మ్యాచ్ లు ఓడిపోకుండా గెలిచింది. అదిరే విజయాలతో ప్లేఆఫ్స్‌ చేరిన ముంబయి, ఎలిమినేటర్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ను ఓడించి జోరుమీద కనిపిస్తోంది.  మరోవైపు పంజాబ్ కు మాత్రం క్వాలిఫయర్ 1 లో ఘోరంగా ఓడిపోయిన పరాభవం వెంటాడుతోంది.  

Also Read :  10న మావోయిస్టుల భారత్‌ బంద్‌..11నుంచి స్మారక సభలు

జోరుమీదున్న పంజాబ్..

ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టు మాంచి ఊపు మీదుంది. నాకౌట్ల మ్యాచ్ లలో భాగా ఆడగలదని చరిత్ర చెబుతోంది. మరోవైపు హార్దిక్ సేన అన్ని విభాగాల్లో బలంగా ఉంది. రోహిత్ శర్మ కూడా ఫామ్ లోకి వచ్చేశాడు. ఓపెనర్ రికిల్ టన్ స్థానంలోకి వచ్చిన బెయిర్ స్టో కూడా అదరగోడుతున్నాడు. మూడో స్థానంలో బ్యాటింగ్ కు దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. తిలక్ వర్మ, హార్దిక్ లతో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. ఇక బుమ్రా, బౌల్ట్, అశ్వని కుమార్, శాంట్నర్‌లు బౌలింగ్ కడా ఆత్మవిశ్వాసంతో ఉంది. బుమ్రాను ఎదుర్కోవడం పంజాబ్‌ బ్యాటర్లకు పెద్ద సవాలే.

Also Read :  ఎస్ఐ గల్లా పట్టి.. పాలకుర్తిలో హైటెన్షన్.. బీఆర్ఎస్ Vs కాంగ్రెస్ ఫైటింగ్!

పంజాబ్ మళ్ళీ ఫామ్ లోకి వస్తుందా..

ఐపీఎల్ లో ఇప్పటి వరకు పంజాబ్ కూడా కప్ ను గెలవలేకపోయింది. ఈ సీజన్ లో ఇది కూడా ఒక ఫేవరెట్ జట్టు. లీగ్ దశ నుంచి గొప్పగా రాణిసతోంది. లీగ్ అయ్యేటప్పటికి టేబుల్ టాప్ లో ఉంది. కానీ లాస్ట్ మ్యాచ్ లో బెంగళూరు చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఇది ఆ జట్టును కొంచెం దెబ్బ తీసింది. దీన్ని అధిమించి పంజాబ్ ఈ రోజు మ్యాచ్ ఆడితే తప్పకుండా గెలిచే అవకాశాలున్నాయి.  టీమ్ లో ప్రియాంశ్‌ ఆర్య, శ్రేయస్‌ అయ్యర్, జోష్‌ ఇంగ్లిస్, నేహాల్‌ వధేరా, స్టాయినిస్, శశాంక్‌ సింగ్‌లతో  బ్యాటింగ్‌  చాలా బలంగా ఉంది. ఈ టోర్నీలో వీళ్ళు ఏడుసార్లు 200పై స్కోర్లు చేయడం విశేషం. బౌలింగ్ కూడా స్ట్రాంగ్ గానే ఉంది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న అర్ష్‌దీప్‌ అదనపు భారాన్ని మోస్తున్నాడు. మరోవైపు చాహల్ కూడా జట్టులోకి వస్తాడని చెబుతున్నారు. అదే కనుక అయితే వాళ్ళిద్దరినీ ఆపడం కష్టమే. లీగ్ దశలో పంజాబ్ జట్టు ముంబైని ఓడించింది. అహ్మదాబాద్ లో ఈ టీమ్ కు మంచి రికార్డ్ కూడా ఉంది.

Also Read :  7వ తరగతి అర్హతతో 1620 ఉద్యోగాలు.. ఒక్కరోజే ఛాన్స్

పిచ్‌ ఎలా ఉందంటే..

అహ్మదాబాద్‌ పిచ్‌ బ్యాటర్లకే అనకూలిస్తుంది. గత మ్యాచ్‌లో  కూడా రెండు జట్లూ 200+ స్కోర్లు సాధించాయి. టాస్‌ గెలిచిన కెప్టెన్‌ బ్యాటింగ్‌ ఎంచుకునే వాళ్ళు మ్యాచ్ గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే అహ్మదాబాద్ లో ఈరోజు వర్షం పడొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. ఒక వేళ అదే కనుక జరిగి మ్యాచ్‌ తుడిచిపెట్టుకుపోతే పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన పంజాబ్‌ ఫైనల్‌కు చేరుతుంది.

Also Read :  బాక్సాఫీస్‌ విజయం కంటే బాధలు తీర్చడంలోనే మజా

IPL 2025 | match | today-latest-news-in-telugu | PBKS vs MI

Advertisment
Advertisment
తాజా కథనాలు