AP High Court Jobs 2025: 7వ తరగతి అర్హతతో 1620 ఉద్యోగాలు.. ఒక్కరోజే ఛాన్స్

ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకై ఏపీ సర్కార్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 1620 పోస్టులను భర్తీ చేయనున్నారు. మే 13 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా.. జూన్ 2 వరకు అప్లై చేసుకోవచ్చు.

New Update
AP High Court Jobs 2025

AP High Court Jobs 2025

ఏపీలో నిరుద్యోగులకు శుభవార అందింది. ఇప్పటికే 16,347 పోస్టులతో ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్‌ 2025 రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరోక భారీ నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకై ఏపీ సర్కార్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీని ద్వారా మొత్తం 1620 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మే 13 నుంచి ప్రారంభమైంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

ఈ లింక్ క్లిక్ చేసి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండి.. https://apdsc.apcfss.in/

Also Read: జూన్ 2025లో భారీగా సెలవులు.. ఫుల్ లిస్ట్ ఇదే

మొత్తం ఖాళీలు : 1620

జూనియర్‌ అసిస్టెంట్‌ - 230 పోస్టులు, ఆఫీస్‌ సబార్డినేట్‌ - 651 పోస్టులు, ప్రాసెస్‌ సర్వర్‌ - 164 పోస్టులు, రికార్డ్‌ అసిస్టెంట్‌ - 24 పోస్టులు, కాపీయిస్ట్‌ - 193 పోస్టులు, ఎగ్జామినర్‌ - 32 పోస్టులు, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ 56 పోస్టులు, టైపిస్ట్‌ - 162 పోస్టులు, స్టెనోగ్రాఫర్‌ - 80 పోస్టులు, డ్రైవర్‌ - 28 పోస్టులు ఉన్నాయి. 

 Also Read: ఏపీలో టీచర్ అరాచకం.. ముసలి వయసులో విద్యార్థినితో పాడు పని - వీడియో

వీటిని జిల్లాలవారీగా భర్తీ చేయనున్నారు. AP HIGH COURT  అఫీషియల్ వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.  మే 13 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. జూన్ 2వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. OBC, EWS కేటగిరీ అభ్యర్థులు రూ.800, SC, ST, దివ్యాంగ అభ్యర్థులు రూ.400 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. 

Also Read: గాంధీ, అబ్దుల్ కలాంతో మల్లారెడ్డి భేటి.. సంచలన వీడియో

సబార్డినేట్ పోస్టులకు 7వ తరగతి విద్యార్హత ఉంటే సరిపోతుంది. అదే జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీ విద్యార్హతగా ఉండాలి. అలాగే టైపిసట్, కాపీయిస్ట్, రికార్డ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ పోస్టులకు ఇంటర్, డిగ్రీ విద్యార్హతతో పాటు సంబంధిత విభాగంలో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. కాగా టైపింగ్, కంప్యూటర్ అనుభవం తప్పనిసరిగా ఉండాలి. 42 ఏళ్లలోపు ఉన్న వారు అర్హులు. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. 

Also Read: ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ రిలీజ్.. ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్స్ ఎప్పుడంటే?

 

jobs | ap-jobs | ap-govt-jobs | ap-high-court-news

Advertisment
Advertisment
తాజా కథనాలు