AK-47 Rifle: డాక్టర్ లాకర్‌లో AK-47 రైఫిల్.. వెలుగులోకి సంచలన విషయాలు

జమ్మూ కాశ్మీర్‌ అనంతనాగ్ జిల్లాలో ప్రభుత్వ మాజీ వైద్యుడు అదిల్ అహ్మద్ రాథర్ లాకర్‌లో ఏకే-47 రైఫిల్ లభ్యం కావడం తీవ్ర కలకలం సృష్టించింది. శ్రీనగర్ పోలీసులు, అనంతనాగ్ జాయింట్ ఇంటరాగేషన్ సెంటర్ (JIC) సాయంతో ఈ విషయం బ యటపడింది.

New Update
AK-47 rifle

జమ్మూ కాశ్మీర్‌(Jammu and Kashmir) లోని అనంతనాగ్ జిల్లా(Anantnag District) లో ప్రభుత్వ మాజీ వైద్యుడు అదిల్ అహ్మద్ రాథర్ లాకర్‌లో ఏకే-47 రైఫిల్ లభ్యం కావడం తీవ్ర కలకలం సృష్టించింది. శ్రీనగర్ పోలీసులు, అనంతనాగ్ జాయింట్ ఇంటరాగేషన్ సెంటర్ (JIC) సాయంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీ అనంతనాగ్‌లో అదిల్ అహ్మద్ రాథర్‌కు చెందిన లాకర్‌ను తనిఖీ చేయగా, అందులో ఈ అత్యాధునిక ఆయుధం బయటపడింది.

అదిల్ అహ్మద్ రాథర్ (31), అనంతనాగ్ జిల్లాలోని ఖాజీగుండ్ నివాసి. GMC అనంతనాగ్‌లో అక్టోబర్ 24, 2024 వరకు సీనియర్ రెసిడెంట్ డాక్టర్‌గా పనిచేశారు. ఇతను ఇటీవల నిషేధిత ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ (JeM)కు మద్దతుగా శ్రీనగర్‌లో పోస్టర్‌లు అంటించిన కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఇతన్ని గుర్తించారు. సాంకేతిక నిఘా ద్వారా అదిల్ ఉత్తరప్రదేశ్ (యూపీ)లోని సహరాన్‌పూర్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, నవంబర్ 6, 2025న అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అదిల్‌ను కస్టడీలోకి తీసుకుని విచారించగా, అతని మాజీ లాకర్‌లో AK-47 రైఫిల్ ఉన్నట్లు వెల్లడైంది. పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Also Read :  ఈ పాస్‌వర్డ్‌ పెట్టుకుంటే ఇక అంతేపని.. హ్యాకర్ల చేతికి తాళం ఇచ్చేస్తుండ్రు!

Doctor Adil Ahmed Rather Locker

ఈ సంఘటనతో వైద్య నిపుణులకు ఉగ్రవాద కార్యకలాపాలలో సంబంధాలు ఉన్నాయనే అనుమానాలు బలపడుతున్నాయి. మాజీ ప్రభుత్వ వైద్యుడి వద్ద AK-47 వంటి శక్తివంతమైన ఆయుధం లభ్యం కావడం భద్రతా సంస్థలను ఆందోళనకు గురిచేసింది. దీనిపై నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో ఆర్మ్స్ చట్టంతో పాటు చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద కేసు నమోదు చేశారు. ఈ రైఫిల్ మూలం, దీనిని దేనికి ఉపయోగించాలనుకున్నారు, ఉగ్రవాద నెట్‌వర్క్‌తో అదిల్‌కు ఉన్న ఇతర సంబంధాలపై శ్రీనగర్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మరో వైద్యుడిని కూడా అరెస్టు చేసినట్లు సమాచారం.

Also Read :  షాకింగ్.. హెల్మెట్‌ ధరించలేదని.. రూ.21 లక్షల జరిమానా

Advertisment
తాజా కథనాలు