Jyothi Yarraji: తైవాన్ అథ్లెటిక్స్‌లో ఏపీ యువతికి గోల్డ్ మెడల్..

తైవాన్ అథ్లెటిక్స్ ఓపెన్-2025లో తెలుగు యువతి జ్యోతి యర్రాజీ గోల్డ్ మెడల్ సాధించారు. 100 మీటర్ల హార్డిల్స్‌ను ఆమె కేవలం 12.99 సెకన్లలో పూర్తి చేశారు. వైజాగ్‌కి చెందిన జ్యోతి చివరి రెండు హార్డిల్స్‌లో వెనుక పడినా అందరినీ దాటుకుంటూ వచ్చి విజేతగా నిలిచారు.

New Update
jyothi yarraji sets record wins 100m hurdles gold medal at Taiwan Athletics Open-2025

jyothi yarraji sets record wins 100m hurdles gold medal at Taiwan Athletics Open-2025

తైైవాన్ అథ్లెటిక్స్ ఓపెన్-2025లో తెలుగు తేజం జ్యోతి యర్రాజీ మరోసారి అదరగొట్టారు. ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌కి చెందిన ఆమె గోల్డ్ మెడల్ సాధించారు. 100 మీటర్ల హార్డిల్స్ ఫైనల్స్‌లో అదరగొట్టేశారు. కేవలం 12.99 సెకన్లలో 100 మీటర్ల హార్డిల్స్‌ను పూర్తి చేసి గోల్డ్ మెడల్ దక్కించుకున్నారు. 

Also Read: జనగణన ఆలస్యం.. మోదీ సర్కార్‌పై స్టాలిన్‌ సంచలన ఆరోపణలు

Jyothi Yarraji

ఈ ఫైనల్ పోరు అత్యంత రసవత్తరంగా సాగింది. ఇందులో చివరి రెండు హార్డిల్స్ వరకు జ్యోతి వెనుకంజలోనే ఉంది. కానీ రెప్పపాటులో అందరినీ దాటుకుంటూ వచ్చి విజేతగా నిలిచారు. దీంతో స్టేడియంలో ఉన్నవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కాగా ఆమె ఇటీవల ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 12.96 సెకన్ల సమయంతో స్వర్ణం గెలుచుకున్నారు. జూన్ 7న శనివారం ఈ భారత అథ్లెట్ 12.99 సెకన్లలో పూర్తి చేసి భారతదేశాన్ని గర్వపడేలా చేసింది. తైవాన్‌లో జరిగిన మల్టీ-స్పోర్ట్స్ ఈవెంట్ ప్రారంభ రోజున ఇది భారత బృందానికి నాల్గవ పతకం. 

Also Read: గృహ హింస బాధితురాలికి రూ.కోటి పరిహారం ఇవ్వాలన్న కోర్టు

మరోవైపు మెన్స్ 110 మీటర్ల హార్డిల్స్‌లో మరో భారత అథ్లెట్ తేజస్ శీర్సే సైతం బంగారు పతకం సాధించారు. అలాగే 2025 తైవాన్ అథ్లెటిక్స్ ఓపెన్‌లో ట్రిపుల్ జంప్‌లో భారతదేశానికి చెందిన అబ్దుల్లా అబూబకర్ బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. 

ఈ ట్రిపుల్ జంప్‌లో అబ్దుల్లా అబూబకర్ ఉత్తమ జంప్ 16.21 మీటర్లుగా నమోదైంది. అబ్దుల్లా అబూబకర్ మూడవ ప్రయత్నంలో తన 16.21 మీటర్ల జంప్‌ను సాధించాడు. దీంతో ఈరోజు 16 మీటర్ల మార్కును దాటిన ఏకైక పోటీదారుడుగా నిలిచాడు. అతడు గతంలో 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకాన్ని గెలుచుకున్నాడు.

 

latest-telugu-news | telugu-news | today-news-in-telugu | telugu-sports-news | telugu-cricket-news

Advertisment
Advertisment
తాజా కథనాలు