Heart Beat Season 2: హాస్పిటల్ డ్రామా మళ్ళీ మొదలు .. 'హార్ట్ బీట్' సీజన్ 2 వచ్చేస్తోంది!

తమిళ్ పాపులర్ వెబ్ సీరీస్ 'హార్ట్ బీట్' సీజన్ 2 స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేశారు. మే 22 నుంచి ప్రసారం కానున్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్రైలర్ విడుదల చేశారు. మెడికల్ స్టూడెంట్స్ కథా నేపథ్యంతో గతేడాది విడుదలైన సీజన్ 1 సూపర్ హిట్ అయ్యింది.

New Update

Heart Beat Season 2:   తమిళ్ తో పాటు తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో కూడా విశేష ప్రేక్షకాదరణ పొందిన మెడికల్ డ్రామా  వెబ్ సీరీస్ 'హార్ట్ బీట్'  సీజన్  2 తో మళ్ళీ వచ్చేస్తుంది. మొదటి సీజన్ ఉత్కంఠభరితమైన మలుపులు, సస్పెన్స్ తో ముగిసింది. ఇందులో సస్పెన్స్ గా మిగిలిన అనేక ప్రశ్నలకు ప్రేక్షకులకు సమాధానం తెలుసుకోవాలని సీజన్ 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

సీజన్ 2 స్టీమింగ్

ఈ క్రమంలో తాజాగా సీజన్ 2 స్టీమింగ్ డేట్ అనౌన్స్ చేశారు. మే 22 నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సీరీస్ ట్రైలర్ విడుదల చేశారు. ''శరీరంలో చోటుచేసుకునే హార్మోన్ల మార్పుల్లాగే.. నా జీవితంలో, హాస్పిటల్ కూడా ఎన్నో మార్పులు వచ్చాయి''.. అంటూ రీనా డైలాగ్ తో ట్రైలర్ ఆసక్తికరంగా కనిపించింది. ఈ సారి రీనా ఇంటర్న్ గా కాకుండా డాక్టర్ గా కనిపించనుంది. 

'హార్ట్ బీట్' రీసెంట్ గా  విడుదలైన వెబ్ సీరీస్ లలో వన్ ఆఫ్ ది ఫీల్ గుడ్ సీరీస్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. సీజన్ 1లో 100 ఎపిసోడ్లు ఉన్నప్పటికీ.. ఏ మాత్రం విసుగు రాకుండా ఆడియన్స్ ని కట్టిపడేసింది.  ఇప్పుడు సీజన్ 2లో  మరింతగా ఎమోషన్స్‌, రొమాన్స్‌,  భావోద్వేగాలతో అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. ‘ఆర్కే హాస్పిటల్‌’ నేపథ్యంలోని  మెడికల్ స్టూడెంట్స్ కథా నేపథ్యంతో ఈ సీరీస్ సాగుతుంది. దీపక్ సుందరరాజన్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో రధి, రీనా, అర్జున్, నవీన్, రాఖీ, తేజు, గుణా, రవి సీనియర్, అనిత  పాత్రలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీపా బాలు, అనుమోల్, చారుకేష్, రామ్, శబరీష్,యోగాలక్ష్మి, శర్వా,  గురు లక్ష్మణ్, పదినే కుమార్ ఈ పాత్రల్లో నటించారు. 
 telugu-news | latest-news | cinema-news | telugu-cinema-news | HeartBeat Season 2

Advertisment
Advertisment
తాజా కథనాలు