/rtv/media/media_files/2025/04/27/o9aIT3NhhClzlxotNXwy.jpg)
Jasprit Bumrah
స్టార్ పేసర్ బుమ్ బుమ్ బుమ్రా ప్రస్తుతం ఐపీఎల్ 2025 సీజన్‌లో అదరగొట్టేస్తున్నాడు. ముంబై తరఫున ఆడుతున్న బుమ్రా.. గాయం కారణంగా మూడు నాలుగు మ్యాచ్‌లకు దూరం అయ్యాడు. అప్పటికి ముంబై జట్టు వరుస మ్యాచ్‌లను కోల్పోయింది. ఇక బుమ్రా రీఎంట్రీతో మళ్లీ ఆ జట్టు పుంజుకుంది. తన దూకుడు బౌలింగ్‌తో ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నాడు.
Also Read: భారీ పేలుడు.. 25 మంది స్పాట్ డెడ్ -1,139 మందికి తీవ్ర గాయాలు
వరుస వికెట్లు తీస్తూ దూసుకుపోతున్నాడు. గాయం తర్వాత కూడా బుమ్రా స్పీడ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇందులో భాగంగానే తాజాగా అతడు సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఇవాళ (ఆదివారం) వాంఖడే స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 4 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
Also Read: ఇంటిలిజెన్స్ కీలక సమాచారం.. ఢిల్లీలో 5వేల మంది పాకిస్తానీలు
నయా రికార్డు
దీంతో ఈ వికెట్లతో చెలరేగిన బుమ్రా కంగొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన ముంబై ఇండియన్స్ బౌలర్‌గా అతడు రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు అగ్ర స్థానంలో ఉన్న లసిత్ మలింగను వెనక్కి నెట్టి బుమ్రా ఈ ఘనతను అందుకున్నాడు.
Also Read: కేంద్రం కీలక నిర్ణయం.. NIA చేతికి పహల్గాం ఉగ్రదాడి కేసు
IPL లో ముంబై ఇండియన్స్ తరపున బుమ్రా 139 మ్యాచ్‌లు ఆడాడు. అందులో మొత్తం 174 వికెట్లు తీశాడు. దీంతో బుమ్రా 22.38 సగటు, 7.31 ఎకానమీతో ఉన్నాడు. అదే సమయంలో లసిత్ మలింగ 122 మ్యాచ్‌లు ఆడాడు. అందులో 170 వికెట్లు పడగొట్టాడు. ఇక IPLతో పాటు ఛాంపియన్స్ లీగ్ T20ల్లో కూడా ముంబై తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా మలింగ కొనసాగుతున్నాడు. అతడు 195 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత రెండో ప్లేస్‌లో బుమ్రా 177 వికెట్లతో కొనసాగుతున్నాడు.
Also Read: స్టూడెంట్స్తో బలవంతంగా నమాజ్ .. ఏడుగురు టీచర్లపై కేసు!
IPL 2025 | MI vs LSG | LSG vs MI | jaspreet-bumrah | latest-telugu-news | telugu-news