/rtv/media/media_files/2025/06/04/7d4EcwH5VEnCascdqIXJ.jpg)
IPL Toppers
IPL Toppers: ఐపీఎల్ కొత్త ఛాంపియన్ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్(Royal Challengers Bangalore). దాంతో పాటూ ఈ సీజన్ లో కొత్త, యంగ్ ప్లేయర్లు టాపర్లుగా నిలిచారు. తమ సత్తా చాటుకుంటూ అవార్డులు అందుకున్నారు. ఇందులో అందరి కంటే ముందు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సాయి సుదర్శన్(Sai Sudarshan) గురించి. మొత్తం ఐపీఎల్ లో అత్యధిక పరుగుల వీరుడు సాయి. అంతేకాదు అత్యధిక ఫోర్లు కొట్టింది కూడా ఇతనే. మొత్తం 88 ఫోర్లు కొట్టి వాహ్ అనిపించుకున్నాడు. ఇక ఎక్కువ సిక్స్ లు కొట్టింది అయితే నికొలస్ పూరన్. మొత్తం 40 సిక్స్ లను బాదేశాడు. ఇక ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) అత్యధిక అర్ధశతకాలను సాధించాడు. 8 హాఫ్ సెంచరీలు ఇతని ఖాతాలో పడ్డాయి. ఫాస్టెస్ట్ సెంచరీ బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) ఎగురేసుకుపోయాడు. బ్యాటర్లలో అత్యధిక స్ట్రైక్ రేట్ కూడా వైభవ్ సూర్యవంశీదే. 206.55 స్ట్రైక్ రేట్ ఇతనిది. ఒక మ్యాచ్ లో ఉత్తమ స్ట్రైక్ రేట్ అయితే 378.57 తో షెపర్డ్ కు దక్కుతుంది. 35 బంతుల్లో వంద పూర్తి చేశాడు. ఇక ఫాస్టెస్ట్ హాఫ్ సెచరీని రొమారియో షెపర్డ్ చేశాడు. 14 బంతుల్లో కొట్టాడు. ఇక హైదరాబాద్ టీమ్ కు చెందిన అభిషేక్ వర్మ 141 పరుగులతో అత్యధిక స్కోరు కొట్టాడు.
Also Read: 'ట్రంప్‌కి మోదీ సరెండర్' అయ్యారు.. రాహుల్ తీవ్ర విమర్శలు
బౌలింగ్ లో టాపర్లు..
ఇక బౌలింగ్ విభానికి వస్తే..పంజాబ్ బౌలర్ చాహల్ హ్యాట్రిక్ వికెట్లు తీసుకున్నాడు. అత్యధిక వికెట్లను ప్రసిద్ధ్ కృష్ణ 25 వికెట్లు తీశాడు. ఉత్తమ బౌలింగ్ గణాంకాలు మిచెల్ స్టార్క్ 35/5 తో సొంతం చేసుకున్నాడు. మొత్తం టోర్నీలో అత్యధికంగా 151 డాట్ బాల్స్ వేసి సూపర్ బౌలర్ అని మరోసారి నిరూపించుకున్నాడు సిరాజ్. ఒక మ్యాచ్ లో అత్యధిక డాట్ బాల్స్ వేసింది అయితే దీపక్ చాహర్. ఇతను విసిరిన డాట్ బాల్స్ 17. బెస్ట్ క్యాచ్ కామిందు మెండిస్ ను, మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ అవార్డ్ సూర్యకుమార్ యాదవ్ ను వరించాయి.
Also Read: ఫలించిన 18 ఏళ్ళ నిరీక్షణ..మిన్నంటిన ఆర్సీబీ సంబరాలు
Here are the award winners of IPL 2025🙌
— SBM Cricket (@Sbettingmarkets) June 3, 2025
Emerging Player of IPL 2025 - Sai Sudharsan
Orange Cap Winner - Sai Sudharsan (759 runs)
Purple Cap Winner - Prasidh Krishna (25 Wickets)
Super Striker of the Season - Vaibhav Suryavanshi
Most sixes in IPL 2025 - Nicholas Pooran (40… pic.twitter.com/VeDGMYLebn
Also Read: ఏం మనిషివిరా.. తినేది ఇండియా సొమ్ము..పాకిస్తాన్కు గూఢచర్యం
Also Read: ఆర్మీ సమాచారం లీక్.. ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులపై వేటు