Rajasthan : ఏం మనిషివిరా..  తినేది ఇండియా సొమ్ము..పాకిస్తాన్కు గూఢచర్యం

పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్నారనే అనుమానంతో జైసల్మేర్‌లో ఓ ప్రభుత్వ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ ఘటన జైపూర్ లో చోటుచేసుకుంది. ప్రస్తుతం భద్రతా సంస్థలు అతన్ని విచారిస్తున్నాయి. నిందితుడిని షకుర్ ఖాన్  గా గుర్తించారు.

New Update
Rajasthan Government Employee

పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్నారనే అనుమానంతో జైసల్మేర్‌లో  ఓ ప్రభుత్వ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ ఘటన జైపూర్ లో చోటుచేసుకుంది. ప్రస్తుతం భద్రతా సంస్థలు అతన్ని విచారిస్తున్నాయి. నిందితుడిని షకుర్ ఖాన్  గా గుర్తించారు. ఇతను జైసల్మేర్‌లోని జిల్లా ఉపాధి కార్యాలయంలో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO)గా పనిచేస్తున్నాడు.  అంతేకాకుండా గతంలో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంలో ఒక మంత్రికి వ్యక్తిగత సహాయకుడిగా కూడా పనిచేశాడు.  

అతని మూడు మొబైల్ ఫోన్‌లను పరిశీలించిన పోలీసులు, పాకిస్తాన్ నిఘా సంస్థ నిర్వాహకులకు రహస్య, సున్నితమైన సమాచారం అందినట్లు ఆధారాలను కనుగొన్నారు. మే 29న జైసల్మేర్ నుండి షకుర్‌ను అదుపులోకి తీసుకున్న  పోలీసులు అనంతరం విచారణ కోసం జైపూర్‌కు తీసుకువచ్చారు. ఝలానాలోని ప్రత్యేక పోలీస్ స్టేషన్‌లో అధికారిక రహస్యాల చట్టం, 1923 కింద అతనిపై కేసు నమోదు చేశారు.  

Also Read :  AP Crime : 8 ఏళ్ల బాలికపై వృద్ధుడు అత్యాచారం.. వృద్ధుడి  గొంతుకోసిన మేనమామ

అనేక మంది నిర్వాహకులతో సంప్రదింపులు

అతను పాకిస్తాన్ నిఘా సంస్థకు చెందిన అనేక మంది నిర్వాహకులతో సంప్రదింపులు జరిపాడని, అతని నుండి దొరికిన మూడు మొబైల్‌లలో అనేక పాకిస్తాన్ నంబర్లతో చాట్ రికార్డులు ఉన్నాయని దర్యాప్తులో వెల్లడైంది. నిందితుడు పాకిస్తాన్ ఐఎస్ఐ, గోపాల్ సింగ్ చావ్లాతో సంప్రదింపులు జరిపి, ఆపరేషన్ సిందూర్ సమయంలో సైనిక కదలికలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పంచుకున్నట్లుగా విచారణలో వెల్లడైంది.  

Also Read : Jammu and Kashmir: ఆర్మీ సమాచారం లీక్‌.. ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులపై వేటు

Advertisment
తాజా కథనాలు