Rishab Pant: లక్నో సూపర్ జెయింట్స్‌ కెప్టెన్‌గా పంత్

ఐపీఎల్‌‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌గా రిషబ్ పంత్‌ను నియమిస్తున్నట్లు ఆ ఫాంఛైజీ తెలిపింది. గతేడాది నవంబర్‌లో ఐపీఎల్ మెగా వేలం జరిగింది. ఇందులో పంత్‌ను లక్నో రూ.27 కోట్లకు దక్కించుకుంది. ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక ధరకు రిషబ్‌ను సొంతం చేసుకుంది.

New Update
Lucknow captian rishab pant

Lucknow captian rishab pant Photograph: (Lucknow captian rishab pant)

టీమిండియా బ్యాటర్ రిషబ్ పంత్ ఐపీఎల్‌‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక ధరకు రిషబ్‌ను లక్నో సూపర్‌ జెయింట్స్‌ సొంతం చేసుకుంది. పంత్‌ను కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గొయెంకా వెల్లడించారు. గతేడాది నవంబర్‌లో జరిగిన మెగా వేలంలో లక్నో రూ.27 కోట్లకు పంత్‌ను దక్కించుకుంది.

ఇది కూడా చూడండి: Saif Ali Khan: సైఫ్‌పై దాడి జరిగేటప్పుడు నలుగురు మగ పనిమనుషులు అక్కడే.. వెలుగులోకి సంచలన నిజాలు

ఇది కూడా చూడండి: Health: చిన్న బెల్లం ముక్కతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో ..కానీ ఏ సమయంలో తినాలో తెలుసా!

మొదటిసారి పంత్ ఐపీఎల్ ఎప్పుడు ఆడాడంటే? 

రిషబ్ పంత్ ఇంతకు ముందు ఢిల్లీ కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే గత సీజన్ ఐపీఎల్‌లో అతను అంతగా టీమ్‌ను ముందుకు నడిపించలేదు. మరి ఈ సీజన్‌లో ఐపీఎల్‌లో ఎలా రాణిస్తాడో చూడాలి. రిషబ్ పంత్ 2016లో మొదటిసారి ఐపీఎల్ ఆడాడు. మొత్తం 111 మ్యాచ్‌లలో 3284 రన్స్ చేశాడు. అయితే అత్యధికంగా 2018 సీజన్‌లో 684 రన్స్ చేశాడు. 

ఇదిలా ఉండగా రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్‌కి కెప్టెన్‌గా ఉన్న సమయంలో కారు ప్రమాదానికి గురయ్యాడు. దీంతో 2023 ఐపీఎల్‌కు దూరమయ్యాడు. గతేడాది మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు. ఇటీవల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడాడు. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో కూడా ఉన్నాడు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు