/rtv/media/media_files/2025/01/20/shdiuoRScrzeLDDEtgrk.jpg)
Bengaluru Honey trap case
Honey trap: బెంగళూరులో హనీట్రాప్ ఘటన సంచలనం రేపుతోంది. శృంగారం ఆశ చూపి ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేసి భారీగా దోచేస్తున్న ముఠా గుట్టురట్టు అయింది. పోలీసుల పేరుతో మారువేషంలో హనీట్రాప్‌కు పాల్పడుతున్న నలుగురు నిందితులను బ్యాడరహళ్లిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంతోష్, అజయ్, జయరాజ్ అనే యువకులతోపాటు ఒక యువతి నయనను అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
సన్నిహితంగా ఉంటూ కొంతకాలం నమ్మించి..
ఇటీవల ఓ కాంట్రాక్టర్‌కు కావాలనే దగ్గరై నయన.. సన్నిహితంగా ఉంటూ కొంతకాలం నమ్మించింది. డబ్బులు అవసరం ఉన్నప్పుడల్లా అతడితో చనువుగా ఉంటూ కాజేసింది. ఈ క్రమంలోనే అతని గురించి పూర్తి కూపీ లాగిన నయన టీమ్ భారీగా దోచేయాలనే ప్లాన్ చేసింది. ఇందులో భాగంగానే కాట్రాంక్టర్ ను టీ కోసం ఇంటికి పిలిపించి అతనికి ఊహించని షాక్ ఇచ్చింది.
ఇది కూడా చదవండి: Divya : రాజకీయాల్లోకి కట్టప్ప కూతురు.. డీఎంకేలో కీలక పోస్ట్!
నయన మీద మోజుతో..
నయన మీద మోజుతో కాంట్రాక్టర్ ఆమె ఇంటికి వెళ్లిన కాసేపటికే పోలీసుల వేషంలో ముఠా సభ్యులు అక్కడికి చేరుకున్నారు. తాము పోలీసులమని కాంట్రాక్టర్‌ను బెదిరించారు. తాము అడిగినంత ఇవ్వాలని, లేదంటే కఠిన శిక్షలు పెట్టి అరెస్ట్ చేస్తామంటూ బ్లాక్ మెయిల్ చేశారు. దీంతో వెంటనే దగ్గరున్న రూ.55వేలు ఇచ్చేయగా.. కాంట్రాక్టర్ మెడలో ఉన్న బంగారు గొలుసు, ఉంగరం, బ్రాస్‌లెట్ కూడా బలవంతంగా లాక్కున్నారు. దీంతో అనుమానం వచ్చిన బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: Lokesh Deputy CM: లోకేష్ డిప్యూటీ సీఎం.. TDP హైకమాండ్ సంచలన ప్రకటన!
ఇదిలా ఉంటే.. బెంగళూరు నగరానికి చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను సైబర్ నేరగాళ్లు దారుణంగా మోసం చేశారు. అతను కొత్త సిమ్ కార్డు కొన్నాడు. అయితే ఈ విషయాన్ని గమనించిన దుండగులు.. న్యూ సిమ్ కార్డుపై కొత్త మొబైల్ ఫోన్ గెలుచుకున్నారని కాల్ చేసి చెప్పి అతని అడ్రస్ కు పంపించారు. ఆ ఆనందంలో పెద్దగా ఆలోచించని టెకీ.. కొత్త ఫోన్ లో సిమ్ వేసుకున్నాడు. దీంతో అతను సిమ్ వేసిన గంట తర్వాత ఆ ఫోన్‌కు మెసేజ్, ఓటీపీలు రావడం మొదలయ్యాయి. యాప్‌లకు తమకు నచ్చిన ఓటీపీలు పెట్టి ఫోన్ పంపిన దుండగులు.. అతని ఖాతాలో ఉన్న రూ.2.8 కోట్లను దోచేశారు. బాధితుడి ఫిర్యాదుతో దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Jackky Bhagnani: షూటింగ్ లో ప్రమాదం.. రకుల్ ప్రీత్ భర్తకు గాయాలు!
Also Read: జ్యూస్లో విషం కలిపి లవర్ను చంపిన కిలాడీ.. కోర్టు సంచలన తీర్పు