IPL 2025: నేటి నుంచే ఐపీఎల్.. నాలుగు కొత్త రూల్స్ తో..

నేటి నుంచే ఐపీఎల్ 2025 మొదలవనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ప్లేయర్లు ఫుల్ ప్రాక్టీస్ చేసి రెడీగా ఉన్నారు. ఈరోజు మొదటి మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్లు తలపడుతున్నాయి. 

author-image
By Manogna alamuru
New Update
list

IPL 2025

మిగతా అన్ని టోర్నమెంట్లూ ఒకఎత్తు. ఐపీఎల్ ఒక్కటీ ఒక ఎత్తు. ఏడాదికి ఒకసారి జరిగే ఈ టోర్నీ కోసం క్రికెట్ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తారు. అన్ని దేశాల ప్లేయర్లు కలపి ఆడే ఈ టోర్నీలో మ్యాచ్ లన్నీ మంచి మజా ఇస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. దాంతో పాటూ ఇది టీ20 టోర్నమెంట్ కావడం వల్ల కూడా అభిమానులు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. 

ఐపీఎల్ 2025 ఈరోజు నుంచే ప్రారంభం అవుతోంది, తొలి మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్లు తలపడడంతో ఈ మ్యాచ్ పై భారీ హైప్ నెలకొంది. ఇక ఈ ఐపీఎల్ కోసం బీసీసీఐ కొత్త రూల్స్ ను ప్రవేశపెట్టింది. 

Also Read :  పాకిస్థాన్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 10 ఉగ్రవాదులు హతం

కొత్త రూల్స్ ఇవే..

ఇంతకు ముందు ఐపీఎల్స్ లో లేని విధంగా ఈసారి నాలుగు కొత్త రూల్స్ ను ప్రవేశపెట్టింది బీసీసీఐ. ఇందులో మొదటిది ఓవర్ కు రెండు బౌన్సర్లు. ఇప్పటివరకు ఫాస్ట్ బౌలర్లు క్రికెట్ లో ఒక ఓవర్లో ఒక్క బౌన్సర్ మాత్రమే వేసే రూల్ ఉంది. కానీ ఇప్పుడు దాన్ని మారుస్తూ ఒక ఓవర్లో ఫాస్ట్ బౌలర్ రెండు బౌన్సర్లు వేయడానికి అనుమతినిచ్చింది.

ఇక రెండో రూల్ స్టంపింగ్ క్యాచ్ చెక్.  ఇందులో  స్టంపింగ్ కోసం రిఫరల్ అభ్యర్థించబడినప్పుడు క్యాచ్‌ను చెక్ చేసే నియమాన్ని కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయించింది. దీని ప్రకారం స్టంపింగ్ నిర్ణయాలను ఖరారు చేసే ముందు క్యాచ్‌ల కోసం చెక్‌లను చేర్చడం వలన ఫీల్డింగ్  నిష్పక్షపాతంగా ఉంటుందని చెబుతోంది.

Also Read :  తాగొచ్చి తల్లిని వేధించిన దుర్మార్గుడు.. చీర, కేబులు వైర్‌తో కాళ్లు, చేతులు కట్టేసి!

మూడో రూల్ స్టాప్ క్లాక్ రూల్. ఈసారి దీనిని ఆపేసింది బీసీసీఐ . ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మధ్య 60 సెకండ్ల కంటే ఎక్కువ గ్యాప్‌‌‌‌‌‌‌‌ ఉండకూడదన్న రూల్ టీ20ల్లో ఉంది, కానీ ఇప్పుడది ఐపీఎల్ కు వర్తించదని చెప్పింది. ఓవర్లకు ఓవర్లకు మధ్య ఎలక్ట్రానిక్ గడియారాన్ని చూపిస్తారు.. నిర్ణీత స‌మ‌యం లోపు ఓవ‌ర్ల కోటా పూర్తి చేసేలా ఇరు జ‌ట్ల కెప్టెన్లను ఈ కొత్త నిబంధన అలర్ట్ చేస్తుంది. అంతే కాదు ఫీల్డింగ్ టీమ్ కు ఓవ‌ర్ల మ‌ధ్య 60 సెక‌న్ల టైం ఉంటుంది. స్టాప్ క్లాక్‌లో సున్నా వ‌చ్చేంత వ‌ర‌కు మ‌రో బౌల‌ర్ ఓవ‌ర్ వేయాల్సిందే. 

Also Read :  అక్రమ వలసదారుల కోసం ట్రంప్ కొత్త యాప్

నాలుగోది స్మార్ట్ రీప్లే సిస్టమ్. ఇదొక కొత్త టెక్నాలజీ. ఎంపైర్లు తీసుకునే నిర్ణ‌యాల్లో మ‌రింత‌ కచ్చితత్వాన్ని, వేగాన్ని పెంచడానికి ఇది ఉపయోగపడనుంది. ఇద్దరు హాక్ ఐ ఆపరేటర్లు టీవీ అంపైర్ ఉన్న ఒకే గదిలో కూర్చుంటారు. స్మార్ట్ రీప్లే సిస్టమ్‌లో భాగంగా ఫీల్డ్ అంతటా ఉన్న హాక్-ఐ ఎనిమిది హై-స్పీడ్ కెమెరాల ద్వారా పొందిన ఫుటేజీని అందిస్తారు. 

Also Read: Israel: గాజాపై ఆగని ఇజ్రాయెల్ దాడులు..85 మంది మృతి

 

new-rules | ipl-2025 | today-latest-news-in-telugu | latest-telugu-news | today-news-in-telugu | telugu-sports-news | telugu-cricket-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు