IPL 2025: హైదరాబాద్‌లో భారీ వర్షం.. SRH Vs RR మ్యాచ్ రద్దు!?

IPL టోర్నీలో భాగంగా SRH Vs RR మధ్య హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. మరికాసేపట్లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. దీంతో మ్యాచ్ రద్దు అవుతుందేమోనని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

New Update
uppal

SRH vs RR Hyderabad Uppal match rain effect

Hyderabad: IPL 2025 టోర్నీలో భాగంగా నేడు SRH Vs RR మధ్య హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. అయితే హైదరాబాద్ తోపాటు రంగారెడ్డి జిల్లాలో మరికాసేపట్లో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. నగరంపై ఇప్పటికే మబ్బులు కమ్ముకోగా..  అభిమానులు ఆందోళన చెందుతున్నారు. వర్షం పడితే మ్యాచ్ రద్దు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. రాత్రి 7.30 గంటలకు చెన్నైలో జరిగే CSK Vs MI మ్యాచుకు కూడా వర్షం ముప్పు ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఆదివారం సెలవుదినం కావడంతో మ్యాచ్ చూసేందుకు భారీగా అభిమానులు చేరుకున్నారు. అభిమానుల కేరింతలతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ కు పాట్ కమ్మిన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్టుకు రియాన్ పరాగ్ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు.  

 

తుది జట్లు ఇవే.. 

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు : అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అభినవ్ మనోహర్, సచిన్ బేబీ, పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, ఆడమ్ జంపా, మహ్మద్ షమీ.

రాజస్థాన్ రాయల్స్ జట్టు : యశస్వి జైస్వాల్, సంజు సామ్సన్, నితీష్ రాణా, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మైర్, ధ్రువ్ జురెల్, శుభం దుబే, వానిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ.

Also read :  గువాహటి ఐఐటీ పరిశోధకుల అద్బుతం.. అంతర్జాతీయ సరిహద్దులపై రోబోల నిఘా !

 ipl-2025 | srh-vs-rr | uppal | rain-effect | telugu-news | today telugu news | latest-telugu-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు