IPL 2025: పంత్‌కు బిగ్ షాక్.. అలా చేసినందుకు భారీ ఫైన్!

లఖ్‌నవూ కెప్టెన్ రిషబ్ పంత్‌కు మరోసారి భారీ ఫైన్ పడింది. ఈ సీజన్‌లో రెండోసారి స్లో ఓవర్ రేట్ నమోదు చేయడంతో IPL యాజమాన్యం రూ.24 లక్షల జరిమానా విధించింది. ఇంపాక్ట్ ప్లేయర్ తోపాటు ఆటగాళ్లకు రూ.6 లక్షలు ఫైన్ వేసింది.

New Update
mi lsg

IPL 2025 Lucknow captain Rishabh Pant fined

IPL 2025: లఖ్‌నవూ కెప్టెన్ రిషబ్ పంత్‌కు మరోసారి భారీ ఫైన్ పడింది. ఈ సీజన్‌లో రెండోసారి స్లో ఓవర్ రేట్ నమోదు చేయడంతో IPL యాజమాన్యం  రూ.24 లక్షల జరిమానా విధించింది. ఇంపాక్ట్ ప్లేయర్ తోపాటు ఆటగాళ్లంతా రూ.6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం ఫైన్ చెల్లించాలని ఆదేశించింది. అయితే పంత్ టీమ్ రెండు సార్లూ ముంబైపైనే స్లో ఓవర్ రేట్ నమోదుకాగా.. ఈ సీజన్లో రాజస్థాన్ టీమ్ కు కూడా రెండు సార్లు స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా పడింది.

Also Read :  బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే భారీ పాపులారిటీ.. సామ్ బర్త్ డే స్పెషల్ స్టోరీ!

ముంబై ఘన విజయం..

ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌట్‌ అయింది. దీంతో 54 పరుగుల తేడాతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఓటమిపాలైంది. మార్ష్ (34), బదోనీ (35) బెస్ట్ స్కోరర్‌గా నిలిచారు. మార్కరమ్ 11 బంతుల్లో 9 పరుగులు, నికోలస్ పూరన్ 15 బంతుల్లో 27 పరుగులు, కెప్టెన్ రిషబ్ పంత్ 2 బంతుల్లో 4 పరుగులు, మిల్లర్ 16 బంతుల్లో 24 పరుగులు, అబ్దుల్ సమద్ 4 బంతుల్లో 2 పరుగులు, రవి బిష్ణోయ్ 14 బంతుల్లో 13 పరుగులు, అవేశ్ ఖాన్ డకౌట్, ప్రిన్స్ యాదవ్ 9 బంతుల్లో 4 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ముంబై బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు తీసి అదరగొట్టేశాడు. ట్రెంట్ బౌల్ట్‌ 3 వికెట్లు, విల్‌ జాక్స్‌ 2 వికెట్లు, కోర్బిన్‌ బాష్‌ 1 వికెట్‌ పడగొట్టారు.

Also Read :  వేసవిలో తలనొప్పి తగ్గించే ఇంటి చిట్కాలు

మొదట బ్యాటింగ్ చేసిన ముంబై.. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో రికిల్టన్ (58), సూర్యకుమార్‌ యాదవ్‌ (54) పరుగులతో రాణించారు. 

Also Read :  అక్షయ తృతీయకు గోల్డ్ కొనేవారికి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

Also Read :  పాక్‌కు మరో బిగ్ షాక్.. ఆ ఛానెల్స్‌పై నిషేధం

 

lsg | mumbai | telugu-news | today telugu news lsg 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు