Headache: వేసవిలో తలనొప్పి తగ్గించే ఇంటి చిట్కాలు

వేసవిలోవేడి వలన శరీర ఉష్ణోగ్రత పెరిగి తలపై ప్రభావం చూపుతుంది. ఈ సమయంలో తలనొప్పిని తగ్గించడానికి తులసి, అల్లంతో చేసిన టీ తాగవచ్చు. ఇంకా చల్లని మజ్జిగ తాగినా శరీరం హైడ్రేట్ అయి తలనొప్పి, అలసట తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

New Update

Headache: వేసవిలో శరీరంలో చాలా వేడి చేరడం సహజం. ఒత్తిడి, అలసట, ఎండ ప్రభావం వంటివి మన శరీరంలో అనేక మార్పులకు కారణమవుతాయి. సూర్యకాంతి వలన శరీర ఉష్ణోగ్రత పెరిగి ప్రత్యేకంగా తలపై ప్రభావం చూపుతుంది. ఈ పరిస్థితిలో తలనొప్పులు రావడం సాధారణం. అయితే ఈ వేడిని తగ్గించడానికి కొన్ని సహజ చిట్కాలు ఉన్నాయి. నువ్వుల నూనెతో తలకు మసాజ్ చేస్తే శరీరానికి మెలు జరుగుతుంది. ప్రతిరోజూ నువ్వుల నూనెతో తలకు సున్నితంగా మసాజ్ చేయడం వల్ల అలసట, తలనొప్పి తగ్గుతాయి. వేసవిలో ఎండలో ఎక్కువ సమయం గడిపితే తలనొప్పులు రావచ్చు.

చల్లని మజ్జిగతో తలనొప్పి పరార్:

ఈ పరిస్థితి నివారించడానికి ఎండ నుంచి తలను కాపాడేందుకు గొడుగు, స్కార్ఫ్ లేదా టోపీ ధరించడం మంచిది. తలనొప్పిని తగ్గించడానికి తులసి, అల్లంతో తయారు చేసిన టీ తాగడం మంచిది. ఇది శరీరం చల్లబడి తలనొప్పి తగ్గుతుంది. ఈ టీ సహజమైనదే కాబట్టి దుష్ప్రభావాలు ఉండవు.  వేసవిలో చల్లని మజ్జిగ తాగడం శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. తలనొప్పి, అలసట తగ్గిస్తుంది. జీర్ణమయ్యే ఆహారాలు తీసుకుంటే తలనొప్పి తగ్గుతుంది.

ఇది కూడా చదవండి: యాదాద్రి థర్మల్ పవర్‌ ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం

చల్లని పండ్లు, సలాడ్లు, మజ్జిగ వంటివి శరీర ఉష్ణోగ్రతను తగ్గించి హైడ్రేషన్ పెంచుతాయి.  శరీరానికి విశ్రాంతి ఇవ్వడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. ఇటువంటి సందర్భాల్లో యోగా, ప్రాణాయామం, పరిష్కారం వ్యాయామాలు వల్ల రక్తప్రసరణను మెరుగుపరిచి తలనొప్పి తగ్గుతుంది. వేసవిలో ఈ చిట్కాలు పాటించడం వల్ల శరీరం వేడెక్కకుండా ఉంటుంది, అలసట,తలనొప్పి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ఉదయాన్నే కలబంద రసం తాగితే 100 వ్యాధులు దరిచేరవు


( buttermilk | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news | telugu-news ) 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు