HBD Samantha బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే భారీ పాపులారిటీ.. సామ్ బర్త్ డే స్పెషల్ స్టోరీ!

ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కేవలం తన నటన నైపుణ్యంతో.. ఇండియాలోనే స్టార్ హీరోయిన్ ఇమేజ్ దక్కించుకున్న సామ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా సమంతకి బర్త్ డే విషెష్ తెలియజేస్తూ.. మరోసారి ఆమె సినిమాలు, విజయాలు, వ్యక్తిగత విషయాలను గుర్తు చేసుకుందాం.

New Update
HBD Samantha

HBD Samantha (Chatgpt AI)

HBD Samantha 'ఏ మాయ చేశావే'  అంటూ అందరినీ తనవైపుకు తిప్పేసుకుంది సమంత.   తొలి సినిమాకే ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. తన స్క్రీన్ ప్రజెన్స్ తో సినీ ప్రియులను మైమరిపించింది.  ఈ సినిమా తర్వాత వెనుతిరిగి చూడలేదు.  ఆటోనగర్ సూర్య, ఈగ , జనతా గ్యారేజ్, ఆహా,  మజిలీ, ఓ బేబీ, మహానటి, శాకుంతలం ఇలా సూపర్ హిట్ సినిమాలతో ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ఎదిగింది. ఏ పాత్ర అయినా .. తనదైన నటనతో ప్రేక్షకులను మైమరిపిస్తుంది సామ్. నటనతో పాటు ఫ్యాషన్, సోషల్ సర్వీస్ ఇలా ప్రతీ రంగంలోనూ తన పేరు వినిపించేలా చేసుకుంది.  చిన్న సేల్స్ గర్ల్ గా  కెరీర్ మొదలు పెట్టి.. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ హీరోయిన్ గా ఎదిగిన సామ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా సినిమాలు, వ్యక్తిగత విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

samantha image
samantha image (Chatgpt)

సినిమా హైలైట్స్ 

ఈ చిత్రాలు సామ్ కెరీర్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ గా పేరు తెచ్చుకున్నాయి.. 

యే మాయా చేసావే

గౌతమ్ వాసుదేవ్ మీనన్  దర్శకత్వంలో సమంత తొలి చిత్రమిది. ఇందులో ఆమె జెస్సీ పాత్ర ప్రేక్షకులను ఫిదా చేసింది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు వచ్చింది. 

ఈగ 

ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో  ఫాంటసీ థ్రిల్లర్‌ గా ఈ చిత్రం సామ్ పాత్ర ఎంతో ప్రత్యేకమైనది.  ఇందులో బిందుగా సామ్ పాత్ర ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. 

SAMANTHA PIC
SAMANTHA PIC (Chatgpt AI)

రంగస్థలం

రంగస్థలంలో రామలక్ష్మీ పాత్రతో నటిగా సామ్ మరో మెట్టు ఎక్కింది. అప్పటివరకు గ్లామరస్ రోల్స్ ప్లే చేసిన సామ్.. అచ్చమైన పల్లెటూరి అమ్మాయిగా పాత్రలో ఒదిగిపోయింది. తన మాటలు, స్క్రీన్ ప్రజెన్స్ తో సినీ ప్రియులను ఫిదా చేసింది.  

మజిలీ 

సామ్ కెరీర్ మజిలీ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచింది. ఇందులో నాగచైతన్య భార్య శ్రావణి పాత్రలో మరోసారి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది సామ్ 

ఓ బేబీ 

ఈ చిత్రం సామ్ 50 ఏళ్ళ వయసున్న ముసలావిడిగా, అదేసమయంలో ఒక బబ్లీ గర్ల్ గా తన పాత్రను అద్భుతంగా ప్రదర్శించింది సామ్.  

ఎదురైన సవాళ్లు

అప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సామ్.. 2022లో మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడింది. ఆ తర్వాత సామ్ కొంతకాలం సినిమాలకు దూరమై.. ఆరోగ్యం పై పూర్తి దృష్టి పెట్టింది. అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నప్పటికీ.. సినిమాపై తనకున్న ఇష్టం, డెడికేషన్ తో అప్పటికే ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసింది సామ్. "సిటాడెల్: హనీ బన్నీ" చిత్రంలో యాక్షన్ సన్నివేశాలను ఆమె ఆరోగ్యం సమస్యలు ఉన్నప్పుడే చిత్రీకరించారు. 2021లో నాగచైతన్యతో విడాకుల తర్వాత, మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్న సమంతా, మిత్రులు,  కౌన్సిలర్ల సహాయంతో వాటిని అధిగమించారు. ​

samantha photo
samantha photo (Chatgpt AI)

ఓటీటీలోనూ.. 

'The Family Man' సిరీస్ తో ఓటీటీలో సత్తా చాటిన తొలి స్టార్ హీరోయిన్ క్రెడిట్ కూడా సామ్ కి దక్కింది. స్టార్ హీరోయిన్లు, హీరోలు ఓటీటీలో నటిస్తే.. ఇమేజ్ తగ్గిపోతుందేమో అనే భావనను తొలగించింది. ఈ సీరీస్ లో సామ్ పాత్రకు  ఫిల్మ్‌ఫేర్ OTT అవార్డు, ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ అవార్డు వరించాయి. 

సామాజిక సేవా కార్యక్రమాలు

సినిమాలతో పాటు సామజిక సేవలోనో తన పేరును చాటుకుంది సామ్ .  2012లో "ప్రత్యూషా సపోర్ట్" అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా ఆమె మహిళలు, పిల్లల ఆరోగ్య సంరక్షణకు సహాయం చేస్తున్నారు. ఆమె 2015లో చెన్నై వరదల సమయంలో 30 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా నటి RTV సమంతకు మరోసారి తరుపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.

telugu-news | latest-news

Advertisment
తాజా కథనాలు