IND vs WI: విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్.. ధోని స్టైల్‌లో కెప్టెన్ గిల్ సంబరాలు!

భారత జట్టు వెస్టిండీస్‌ను (2-0) క్లీన్ స్వీప్ చేసింది. అహ్మదాబాద్, ఢిల్లీ వేదికగా జరిగిన రెండు టెస్టుల్లో ఘన విజయం సాధించింది. అరుణ్‌జైట్లీ వేదికగా జరిగిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో విండీస్ ను ఓడించి సిరీస్ కైవసం చేసుకుంది.

New Update
ind vs

IND vs WI: భారత జట్టు వెస్టిండీస్‌ను (2-0) క్లీన్ స్వీప్ చేసింది. అహ్మదాబాద్, ఢిల్లీ వేదికగా జరిగిన రెండు టెస్టుల్లో ఘన విజయం సాధించింది. అరుణ్‌జైట్లీ వేదికగా జరిగిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో విండీస్ ను ఓడించి సిరీస్ కైవసం చేసుకుంది. విండీస్ 121 పరుగులు లక్ష్యాన్ని విధించగా 3 వికెట్లు కోల్పోయి చేధించింది. కేఎల్ రాహుల్ (58*; 108 బంతుల్లో.. ఓవర్‌నైట్ స్కోరు 25) హాఫ్‌ సెంచరీతో రాణించాడు. సాయి సుదర్శన్ (39; 76 బంతుల్లో) ఓవర్‌నైట్‌ స్కోరుకు మరో 9 పరుగులు జోడించి ఔటయ్యాడు. శుభ్‌మన్ గిల్ (13; 15 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్‌) ఔట్ కాగా.. ధ్రువ్ జురెల్ (6*) నాటౌట్‌గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. 

Also Read: Baahubali The Epic: ఎవరి వల్ల కానిది 'బాహుబలి: ది ఎపిక్' రీరిలీజ్ తో జరుగుతోంది.. ఏంటో తెలిస్తే..!

India Won The Test Series Against West Indies

ఇక ఈ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 518/5 డిక్లేర్డ్ చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ 248 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో విండీస్ ను భారత్ ఫాలో ఆన్ ఆడించగా రెండో ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ పుంజుకుంది. క్యాంబెల్ 115, హోప్ 103 సెంచరీలతో చెలరేగగా 390 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ ముందు 121 పరుగుల లక్ష్యాన్ని ఉంచగా భారత్ సునయాసంగా ఛేధించి ట్రోఫీని గెలుచుకుంది. ఇక కెప్టెన్‌గా తొలి టెస్టు సిరీస్ సాధించిన శుభ్‌మన్ గిల్ ధోనీ స్టైల్ లో సంబరాలు చేసుకున్నాడు. బీసీసీఐ కార్యదర్శి రాజీవ్ శుక్లా చేతులమీదుగా విన్నింగ్ ట్రోఫీ తీసుకుని జట్టులోకి కొత్తగా వచ్చిన నారాయణ్‌ జగదీశన్‌కు అందించాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ రవీంద్ర జడేజాకు దక్కగా..ఈ మ్యాచ్ లో 8 కీలక వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు. ఇక వెస్టిండీస్‌పై భారత్‌కు ఇది వరుసగా 10వ టెస్టు సిరీస్‌ విజయం. 

ఇది కూడా చూడండి: BSNL Recharge Plan: రూ.99లకే బీఎస్‌ఎన్‌ఎల్ బంపరాఫర్.. అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో పాటు అదిరిపోయే ప్లాన్స్

మొదటి ఇన్నింగ్స్‌లో భారత ప్లేయర్లు యశస్వి జైస్వాల్ (175), శుభ్‌మన్ గిల్ (129*), ధ్రువ్ జురెల్ (44), నితీశ్‌ రెడ్డి (43) అదరగొట్టారు. కుల్‌దీప్ యాదవ్ (5/82), జడేజా (3/46) విజృంభించడంతో విండీస్ 248 పరుగులకే కుప్పకూలింది. 

ఇది కూడా చూడండి: Gold Rates: దీపావళి వేళ మహిళలకు బిగ్ షాక్.. రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధరలు

Advertisment
తాజా కథనాలు