BSNL Recharge Plan: రూ.99లకే బీఎస్‌ఎన్‌ఎల్ బంపరాఫర్.. అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో పాటు అదిరిపోయే ప్లాన్స్

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఉపయోగించే వారి సంఖ్య ప్రస్తుతం పెరుగుతోంది. అయితే  దేశవ్యాప్తంగా తన 4G నెట్‌వర్క్‌ను విస్తరిస్తూ, యూజర్లను ఆకట్టుకునేందుకు అనేక మంచి ప్రీపెయిడ్ ప్లాన్లను బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది. అవేంటో చూద్దాం.

New Update
BSNL new recharge

BSNL recharge

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఉపయోగించే వారి సంఖ్య ప్రస్తుతం పెరుగుతోంది. అయితే  దేశవ్యాప్తంగా తన 4G నెట్‌వర్క్‌ను విస్తరిస్తూ, యూజర్లను ఆకట్టుకునేందుకు అనేక మంచి ప్రీపెయిడ్ ప్లాన్లను బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలను అందించడంలో బీఎస్ఎన్ఎల్ ముందుంటోంది. జియో, ఎయిర్‌టెల్ వంటివి భారీగా రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచడంతో ఎక్కువ శాతం మంది బీఎస్‌ఎన్‌ఎల్ వాడటానికి మక్కువ చూపిస్తున్నారు. అయితే తక్కువ ధరకే రీఛార్జ్ చేసుకుంటే అన్‌లిమిటెడ్ కాలింగ్ వినియోగించవచ్చు. మరి ఆ ప్లాన్స్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. 

ఇది కూడా చూడండి: Amazon Offer: ఆఫరండీ బాబు.. రూ.6 వేలకే 5జీ స్మార్ట్‌ఫోన్.. దిమ్మతిరిగే ఫీచర్లు!

యూజర్ల కోసం ఆకర్షణీయమైన ప్లాన్..

బీఎస్ఎన్ఎల్ యూజర్ల కోసం ఒక ఆకర్షణీయమైన ప్లాన్ ఉంది. అదే రూ. 99 ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్ 15 రోజుల వరకు మీకు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్‌ను రెండు సార్లు రీఛార్జ్ చేసుకుంటే మీకు కేవలం రూ. 198 మాత్రమే ఖర్చవుతుంది. దీని ద్వారా మీరు మొత్తం 30 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాలింగ్ చేసుకోవచ్చు. అలాగే దీనికి 50MB హై స్పీడ్ డేటా కూడా లభిస్తుంది. 50MB డేటా అయిపోయిన తర్వాత స్పీడ్ 40 Kbps కి తగ్గుతుంది. కానీ అపరిమిత డేటా వాడుకోవచ్చు. ఈ ప్లాన్‌ను రెండుసార్లు రీఛార్జ్ చేసుకుంటే మీకు నెల మొత్తం బెనిఫిట్స్ అందుతాయి. 

హైస్పీడ్‌ డేటాతో..

ఇంకా ఎక్కువగా ప్లాన్ వల్ల ప్రయోజనాలు పొందాలంటే రూ. 229 ప్రీపెయిడ్ ప్లాన్ మీకు సరిగ్గా సరిపోతుంది. ఈ ప్లాన్ పూర్తిగా నెల రోజులు చెల్లుబాటు అవుతుంది. అపరిమిత కాలింగ్ ఉంటుంది. అలాగే ప్రతీ రోజు 2GB హై స్పీడ్ డేటా లభిస్తుంది. రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు వస్తాయి. రోజువారీ 2GB హై స్పీడ్ డేటా అయిపోయిన తర్వాత కూడా 40 Kbps స్పీడ్‌తో అపరిమిత డేటా వాడుకోవచ్చు. బీఎస్ఎన్ఎల్ ప్రస్తుతం 5G నెట్‌వర్క్‌ను కూడా త్వరగా తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. 5G అందుబాటులోకి వస్తే బీఎస్ఎన్ఎల్ యూజర్లు తక్కువ ఖర్చుతో 5G సేవలను పొందవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇది కూడా చూడండి: Gold Rates: దీపావళి వేళ మహిళలకు బిగ్ షాక్.. రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధరలు

Advertisment
తాజా కథనాలు