Women's World cup : భారత్ vs దక్షిణాఫ్రికా.. ఎవరూ గెలిచిన చరిత్రే

సెమీస్‌లో ఆసీస్‌పై గెలుపుతో  హర్మన్ సేన నిన్న ఫైనల్‌లోకి అడుగు పెట్టి దక్షిణాఫ్రికాతో NOV 2న తలపడనుంది. ఇందులో ఎవరూ గెలిచిన చరిత్రే అవుతుంది. 1973 నుంచి మహిళల వరల్డ్ కప్ జరుగుతుండగా ఇప్పటివరకు  కేవలం 3 జట్లే విజేతలుగా నిలిచాయి.

New Update
final

సెమీస్‌లో ఆసీస్‌పై గెలుపుతో  హర్మన్ సేన నిన్న ఫైనల్‌లోకి అడుగు పెట్టి దక్షిణాఫ్రికాతో NOV 2న తలపడనుంది. ఇందులో ఎవరూ గెలిచిన చరిత్రే అవుతుంది. 1973 నుంచి మహిళల వరల్డ్ కప్(ICC Women's World Cup) జరుగుతుండగా ఇప్పటివరకు  కేవలం 3 జట్లే విజేతలుగా నిలిచాయి. 1973 నుంచి మహిళల వన్డే ప్రపంచకప్ జరుగుతుండగా, ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ చరిత్రలో ఇప్పటివరకు కేవలం మూడు జట్లు మాత్రమే విజేతలుగా నిలిచాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మాత్రమే ఈ కప్పును ముద్దాడాయి. ఈ నేపథ్యంలో, హర్మన్ సేన ఈసారి ప్రపంచకప్‌ను గెలిస్తే, విజేతల జాబితాలో చేరిన నాలుగో జట్టుగా, ఆసియా నుంచి తొలి జట్టుగా నిలిచి చరిత్ర సృష్టించనుంది. 

Also Read :  కోల్‌కతా నైట్ రైడర్స్ కీలక నిర్ణయం!

1973: ఇంగ్లండ్, 1978: ఆస్ట్రేలియా, 1982: ఆస్ట్రేలియా, 1988: ఆస్ట్రేలియా, 1993: ఇంగ్లండ్, 1997: ఆస్ట్రేలియా, 2000: న్యూజిలాండ్, 2005: ఆస్ట్రేలియా, 2009: ఇంగ్లండ్, 2013: ఆస్ట్రేలియా, 2017: ఇంగ్లండ్, 2022: ఆస్ట్రేలియా వరల్డ్ కప్ గెలుచుకున్నాయి.  మహిళల క్రికెట్‌లో ఏడుసార్లు ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియాపై సెమీస్‌లో విజయం సాధించడం భారత క్రికెట్‌కు గొప్ప మైలురాయిగా నిలిచింది. ఈ విజయంతో భారత జట్టు మూడోసారి ప్రపంచ కప్ ఫైనల్‌లోకి ప్రవేశించింది. 

Also Read :  ప్రాక్టీస్ లో బాల్ తగిలి టీనేజ్ క్రికెటర్ మృతి

ముంబైలో ఫైనల్ 

నవంబర్ 2న ముంబైలో  భారత్, దక్షిణాఫ్రికా(south-africa) జట్ల మధ్య ఫైనల్ జరగనుంది.  హర్మన్ సేన ఫైనల్‌కు చేరుకోవడంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. క్రీడాభిమానులంతా భారత్ కప్ గెలవాలని ఆకాంక్షిస్తున్నారు. నవంబర్ 2న SAతో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి, కప్పును గెలిచి, ఈ రికార్డును తిరగరాస్తుందని అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు.

Advertisment
తాజా కథనాలు