KKR : కోల్‌కతా నైట్ రైడర్స్ కీలక నిర్ణయం!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌కు ముందు మాజీ ఆల్‌రౌండర్ అభిషేక్ నాయర్‌ను తమ కొత్త ప్రధాన కోచ్‌గా నియమించింది. గత సీజన్‌లో జట్టు నిరాశపరిచిన నేపథ్యంలో, ఇప్పటివరకు ప్రధాన కోచ్‌గా ఉన్న చంద్రకాంత్ పండిట్ స్థానంలో నాయర్‌ను నియమించారు.

New Update
abhishek

కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026(IPL 2026) సీజన్‌కు ముందు మాజీ ఆల్‌రౌండర్ అభిషేక్ నాయర్‌ను తమ కొత్త ప్రధాన కోచ్‌గా నియమించింది. గత సీజన్‌లో జట్టు నిరాశపరిచిన నేపథ్యంలో, ఇప్పటివరకు ప్రధాన కోచ్‌గా ఉన్న చంద్రకాంత్ పండిట్ స్థానంలో నాయర్‌ను నియమించారు. గత కొంతకాలంగా కేకేఆర్ ఫ్రాంచైజీతో అనుబంధం ఉన్న అభిషేక్ నాయర్‌కు ఈసారి ఏకంగా హెడ్ కోచ్‌గా బాధ్యతలు అప్పగించాలని యాజమాన్యం నిర్ణయించింది. 

Also Read :  ప్రాక్టీస్ లో బాల్ తగిలి టీనేజ్ క్రికెటర్ మృతి

గతంలో ఆయన జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా, కేకేఆర్ అకాడమీకి అధిపతిగా పనిచేశారు. అభిషేక్ నాయర్ కు  కేకేఆర్ జట్టులోని పలువురు యువ ఆటగాళ్లతో మంచి అనుబంధం ఉంది. ముఖ్యంగా రింకూ సింగ్ మరియు వరుణ్ చక్రవర్తి వంటి ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఫిట్‌నెస్ విషయంలో అద్భుతమైన మార్పు తీసుకురావడంలో నాయర్ కీలక భూమిక పోషించడం తెలిసిందే. 

రోహిత్‌తో సహా దినేష్ కార్తీక్, కేఎల్ రాహుల్ వంటి స్టార్ ప్లేయర్లకు వ్యక్తిగత శిక్షకుడిగా నాయర్ మంచి పేరు సంపాదించారు. ఆయన గతంలో మహిళల ప్రీమియర్ లీగ్‌లో (WPL) యూపీ వారియర్స్ జట్టుకు హెడ్ కోచ్‌గా కూడా పనిచేశారు. ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు ఈ కీలక నియామకం జట్టుకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని, నాయర్ అనుభవం కేకేఆర్‌ను తిరిగి విజయాల బాట పట్టిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. కాగా భారత జట్టు తరపున మూడు వన్డేలు ఆడిన అభిషేక్ నాయర్ గతంలో అనేక జట్లకు కోచ్‌గా పనిచేశాడు. గతంలో భారత జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా కూడా సేవలదించాడు. 

Also Read :  BCCI : శ్రేయస్ అయ్యర్ ఆరోగ్యంపై బీసీసీఐ కీలక ప్రకటన

KKR హెడ్ కోచ్‌ల జాబితా

2010-2011: డేవ్ వాట్మోర్

2012-2015: ట్రెవర్ బేలిస్

2016-2019: జాక్వెస్ కాలిస్

2020-2022: బ్రెండన్ మెకల్లమ్

2023-2025: చంద్రకాంత్ పండిట్

ప్రస్తుతం: అభిషేక్ నాయర్

Advertisment
తాజా కథనాలు