/rtv/media/media_files/2025/09/10/ind-vs-uae-2025-2025-09-10-06-48-56.jpg)
IND Vs UAE 2025
ఆసియా కప్ 2025(Asia cup 2025) టోర్నీ నిన్న (మంగళవారం) అట్టహాసంగా ప్రారంభమైంది. మొదటి మ్యాచ్ అఫ్గానిస్తాన్ vs హాంకాంగ్ మధ్య జరిగింది. అత్యంత రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ ఘన విజయం సాధించింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గానిస్తాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.
అఫ్గాన్ బ్యాటర్లలో సెధిఖుల్లా అటల్ 52 బంతుల్లో 73 పరుగులు చేశాడు. అందులో 6 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. అలాగే అజ్మతుల్లా ఒమర్జాయ్ 21 బంతుల్లో 53 పరుగులు చేసి అదరగొట్టేశాడు. అనంతరం 189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన హాంకాంగ్ మొదట్లోనే తడబడింది. కేవలం 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. చివరికి పోరాడి పోరాడి 94 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
Also Read : ఆసియా కప్‌కు ముందు టీం ఇండియాకు గుడ్‌న్యూస్.. రిషబ్ పంత్ రెడీ..!
IND Vs UAE 2025
India is set to kick off their Asia Cup 2025 campaign against the UAE on September 10 in Dubai, with the highly anticipated India vs Pakistan clash scheduled for September 14.#AsiaCup2025#Indiapic.twitter.com/EjLpX0zHs0
— MD Raju 🇮🇳 (@MDRaju_Live) September 9, 2025
ఇక ఇవాళ జరగనున్న మ్యాచ్ కోసం క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నేడు భారత్ vs యూఏఈ(IND Vs UAE 2025) మధ్య అత్యంత రసవత్తరమైన మ్యాచ్ జరగబోతోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. పసికూన యూఏఈతో తొలి మ్యాచ్ కోసం ఎంతో మంది క్రికెట్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో స్టార్ బ్యాటర్ల ఫామ్ ఎలా ఉండబోతుందోనన్న ఉత్కంఠ అందరిలోనూ ఉంది. అయితే టీ20 ప్రపంచ ఛాంపియన్ భారత్‌కు.. యూఏఈ జట్టుపై గెలవడం పెద్ద పనేం కాకపోవచ్చు. కానీ టీ20ల్లో ఏ టీంను తక్కువ అంచనా వేయకూడదు.
ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్, శుభ్ మన్ గిల్, అభిషేక్ శర్మ వంటి స్టార్ బ్యాటర్ల బాదుడిపైనే అందరి కళ్లు ఉన్నాయి. చూడాలి మరి ఇవాళ్టి మ్యాచ్ ఎలా ఉండబోతుందో. మరోవైపు భారత్(team-india) ఇప్పటివరకు యూఏఈతో ఒకే ఒక్క టీం మ్యాచ్ ఆడింది. 2016 ఆసియా కప్‌లో ఈ మ్యాచ్ జరిగింది. ఇందులో భారత్ 9 వికెట్ల తేడాతో మ్యాచ్ గెలిచింది.
Also Read : నేటి నుంచే ఆసియాకప్ టీ20 టోర్నీ.. ఎక్కడ, ఎప్పుడు చూడొచ్చంటే?
తుది జట్లు (అంచనా)
భారత్: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్,, తిలక్ వర్మ, జితేశ్ శర్మ/సంజు శాంసన్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్/హర్షిత్ రాణా, కుల్‌దీప్ యాదవ్.
యూఏఈ: మహ్మద్ వసీమ్ (కెప్టెన్), షరాఫు, మహ్మద్ ఫరూఖ్, హర్షిత్ కౌశిక్, మహ్మద్ జోహైబ్, రాహుల్ చోప్రా (వికెట్ కీపర్), అసిఫ్ ఖాన్, సఘీర్ ఖాన్, హైదర్ అలీ, జునైద్ సిద్ధిఖ్, మహ్మద్ రోహిద్.