Rishabh Pant: ఆసియా కప్‌కు ముందు టీం ఇండియాకు గుడ్‌న్యూస్.. రిషబ్ పంత్ రెడీ..!

త్వరలో జరగబోయే భారత్-వెస్టిండీస్ టెస్ట్ సిరీస్‌లో రిషబ్ పంత్ తిరిగి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో పంత్‌కు గాయమైన విషయం తెలిసిందే. ఈ గాయం కారణంగా ఆసియా కప్‌కు కూడా దూరమయ్యాడు. ఇప్పుడు అతడి గాయం తగ్గినట్లు సమాచారం.

New Update
rishabh pant likely return ind vs wi test series

rishabh pant likely return ind vs wi test series

నేటి నుంచి క్రికెట్ ప్రియులకు పండగే పండగ. 2025 ఆసియా కప్ టీ20 టోర్నమెంట్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. యూఏఈ ఆతిథ్యంలో దాదాపు ఎనిమిది జట్లు తలపడబోతున్నాయి. ఇవాళ 8 గంటల నుంచి తొలి మ్యాచ్ జరగబోతుంది. ఈ టోర్నీ కోసం టీమిండియా సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో భారత జట్టుకు అదిరిపోయే శుభవార్త అందింది. తాజాగా స్టార్ బ్యాటర్ అండ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ హెల్త్ గురించి ఓ పెద్ద అప్డేట్‌ వచ్చింది. 

 టీం ఇండియాకు గుడ్‌న్యూస్..

గతంలో ఇంగ్లాండ్ పర్యటనలో 5 టెస్ట్ మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరిగింది. ఇందులో భాగంగా నాల్గవ టెస్ట్ మ్యాచ్‌లో రిషభ్ పంత్‌ కాలుకు తీవ్ర గాయం అయింది. క్రిస్ వోక్స్ వేసిన బంతిని రివర్స్ షాట్ కొట్టడానికి ప్రయత్నిస్తూ పంత్ కుడి కాలికి గాయమైంది. ఈ గాయం తర్వాత పంత్ గ్రౌండ్‌ నుంచి దూరమయ్యాడు. అక్కడ నుంచి రిషబ్ పంత్ ముంబై చేరుకున్నాడు. అక్కడ అతని గాయాన్ని డాక్టర్లు పరిశీలించి చికిత్స అందించారు.

తాజాగా అతడి కాలు గాయానికి సంబంధించి ఓ పెద్ద అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం పంత్ కాలుకు బ్రేస్ ఉన్నట్లు తెలిసింది. అతడ్ని NCAలో పునరావాసం ప్రారంభించమని డాక్టర్లు సలహా ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం పంత్ గాయం కాస్త తగ్గినట్లు తెలుస్తోంది. త్వరలో పూర్తిగా కోలుకుని మళ్లీ మైదానంలోకి వస్తాడని అంతా భావిస్తున్నారు. అయితే పంత్ హెల్త్ రిపోర్ట్ అఫీషియల్‌గా ఇంకా బయటకు రాలేదు. ఇక గాయం కారణంగా.. పంత్‌కు 2025 ఆసియా కప్ కోసం టీమ్ ఇండియాలో కూడా అవకాశం లభించలేదు. దీని కారణంగా సంజు సామ్సన్, జితేష్ శర్మలను సెలెక్టర్లు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా చేర్చారు. 

ఈ నేపథ్యంలో మరో వార్త పంత్ అభిమానుల్ని సర్‌ప్రైజ్ చేసింది. త్వరలో రిషబ్ పంత్ వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగే టెస్ట్ సిరీస్‌లో టీమ్ ఇండియా తరపున తిరిగి ఆడవచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఒకవేళ ఈ సిరీస్‌లో కూడా అతను తిరిగి రాకపోతే.. పంత్ ఆస్ట్రేలియా పర్యటనకు తిరిగి రావచ్చని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Advertisment
తాజా కథనాలు