/rtv/media/media_files/2025/09/09/asia-cup-2025-started-today-2025-09-09-08-27-35.jpg)
Asia Cup 2025 Started today
2025 ఆసియా కప్ టీ20 టోర్నీ నేటి నుంచి షురూ కానుంది. ఈ టోర్నమెంట్‌కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ఆతిథ్యం ఇస్తుంది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (దుబాయ్), షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియం (అబుదాబి) వేదికగా ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ టోర్నీలో దాదాపు 8 జట్లు పోటీపడనున్నాయి. అందులో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, యూఏఈ, ఒమన్, మరియు హాంకాంగ్ జట్లు ఉన్నాయి.
వీటిలో గ్రూప్ ఏ లో భారత్, పాకిస్థాన్, ఒమన్, యూఏఈ తలపడనుండగా.. గ్రూప్-బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, హాంకాంగ్ ఆడనున్నాయి. ఈ సారి టీమిండియా తిరుగులేని ఫేవరేట్‌గా బరిలో దిగనుంది. మరీ ముఖ్యంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో సూర్య సేన పోరు అత్యంత రసవత్తరంగా మారబోతుంది. ఇవాళ అఫ్గానిస్థాన్, హాంకాంగ్ మ్యాచ్‌తో టోర్నీ అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతుంది.
The 17th #AsiaCup Cricket will begin today with Afghanistan taking on Hong Kong in the opening match in Abu Dhabi.
— All India Radio News (@airnewsalerts) September 9, 2025
Played alternately in ODI and T20I formats since 2016, this year’s edition will be contested in the T20 format, providing crucial preparation for next year’s ICC… pic.twitter.com/89qtqN4wHa
ఈ నేపథ్యంలో భారత్‌లో ఈ టోర్నమెంట్‌ను ఎక్కడ చూడాలి? అనే డౌట్ అందరికీ కలుగుతుంది. ఈ టోర్నీని సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో చూడవచ్చు. లైవ్ స్ట్రీమింగ్ సోనీ లివ్ యాప్, వెబ్‌సైట్ ద్వారా అందుబాటులో ఉంటుంది. సోనీ స్పోర్ట్స్ 1, సోనీ స్పోర్ట్స్ 3 (హిందీ), సోనీ స్పోర్ట్స్ 4 (తెలుగు), సోనీ స్పోర్ట్స్ 4 (తమిళ్), సోనీ స్పోర్ట్స్ 5 ఛానెళ్లలో మ్యాచ్‌లు ప్రసారం అవుతాయి. ఇవాళ్టి మ్యాచ్ కోసం 7.30 గంటలకు టాస్ వేయనున్నారు. 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
Get ready, cricket fans! The Asia Cup 2025 officially starts on Tuesday, September 9 — with Afghanistan taking on Hong Kong in Abu Dhabi to kick things off pic.twitter.com/ETkvE41gNm
— Cricwire (@CricWireLK) September 8, 2025
భారత మ్యాచ్‌లు:
సెప్టెంబర్ 10: భారత్ vs యూఏఈ (దుబాయ్)
సెప్టెంబర్ 14: భారత్ vs పాకిస్తాన్ (దుబాయ్)
సెప్టెంబర్ 19: భారత్ vs ఒమన్ (అబుదాబి)
🚨 ALL UPDATE ON ASIA CUP 2025 🚨
— Tanuj (@ImTanujSingh) September 8, 2025
Venues - Dubai & Abu Dhabi.
Toss - 7.30 PM IST.
Match Start - 8 PM IST.
Telecast on TV - Sony Sports 1, 3, 4 & 5.
Telecast on Digital - Sony LIV.
Languages - Hindi, English, Tamil, Telegu. pic.twitter.com/ugq5obiyYw
ఆసియా కప్ 2025 బరిలోకి దిగే భారత ఫైనల్ జట్టు విషయానికొస్తే.. అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జితేష్ శర్మ(కీపర్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి బరిలోకి దిగనున్నట్లు సమాచారం. వీరిలో శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేస్తారని టాక్ నడుస్తోంది. మూడో ప్లేస్‌లో తిలక్ వర్మ కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఇక సూర్య కుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్డిక్ పాండ్యా, జితేష్ శర్మ మిడిలార్డర్‌లో దిగుతారని సమాచారం.