Ind vs Aus: ఆసీస్‌ ఆలౌట్.. భారత్ ఘన విజయం

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ20 సిరీస్‌‌ నాల్గవ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. నిర్దేశించిన 20 ఓవర్లలో భారత్ 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా జట్టు 119 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

New Update
India vs AUS

India vs AUS

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ20 సిరీస్‌‌ నాల్గవ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. నిర్దేశించిన 20 ఓవర్లలో భారత్ 8 వికెట్లు కోల్పోయి ఆలౌట్ అయ్యింది. దీంతో 48 పరుగుల తేడాతో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. 5 మ్యాచుల సిరీస్‌లో 2-1 తేడాతో భారత్ ఆధిక్యంలో ఉంది. ఆసీస్ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ 30 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లు మాత్రం విఫలమయ్యారని చెప్పవచ్చు. 

Also Read :  IND VS AUS: తడబడిన భారత్.. ఆస్ట్రేలియా ముందు టార్గెట్ ఎంతంటే?

Ind vs Aus T20 Series Fourth Match

Also Read :  Arshdeep Singh: అర్ష్‌దీప్‌ను అందుకే పక్కన పెట్టాం: టీమిండియా బౌలింగ్ కోచ్ సంచలన వ్యాఖ్యలు

భారత్ బ్యాటర్లలో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఒక్కడే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడు 39 బంతుల్లో 46 పరుగులు చేశాడు. అందులో 4 ఫోర్లు, 1 సిక్స్ ఉంది. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ పర్వాలేదనిపించాడు. 21 బంతుల్లో 28 పరుగులు చేశాడు. శివమ్ దూబే 22 పరుగులు, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 20 పరుగులు, తిలక్ వర్మ 5 పరుగులు, కీపర్ జితేష్ శర్మ 3 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 12 పరుగులు చేయగా.. అర్ష్ దీప్ సింగ్ డకౌట్‌గా నిలిచాడు. అక్షర్ పటేల్ 21*, వరుణ్ చక్రవర్తి 1* పరుగుతో నాటౌట్‌గా నిలిచారు. ఇక ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎల్లీస్ 3 వికెట్లు, స్టాయినీస్ 1 వికెట్, ఆడమ్ జంపా 3 వికెట్లు, బార్టిలెట్ 1 వికెట్ తీశారు.

Advertisment
తాజా కథనాలు