IND VS AUS: తడబడిన భారత్.. ఆస్ట్రేలియా ముందు టార్గెట్ ఎంతంటే?

భారత్, ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్‌లో నాల్గవ మ్యాచ్ జరుగుతోంది. ఇందులో భాగంగా భారత్ తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో భారత్ 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. దీంతో ఆసీస్ ముందు 168 పరుగుల టార్గెట్ ఉంది.

New Update
IND VS AUS 4th t20

IND VS AUS 4th t20

భారత్, ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్‌(ind-vs-aus-t20-series)లో నాల్గవ మ్యాచ్ జరుగుతోంది. ఇందులో భాగంగా భారత్ తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో భారత్ 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. దీంతో ఆసీస్ ముందు 168 పరుగుల టార్గెట్ ఉంది. భారత్ బ్యాటర్లలో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఒక్కడే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడు 39 బంతుల్లో 46 పరుగులు చేశాడు. అందులో 4 ఫోర్లు, 1 సిక్స్ ఉంది. 

Also Read:  ప్రధాని మోడీకి క్రికెటర్ హర్లీన్ డియోల్ చిలిపి ప్రశ్న..ఏం అడిగిందంటే?

IND VS AUS 4th T20

మరో ఓపెనర్ అభిషేక్ శర్మ పర్వాలేదనిపించాడు. 21 బంతుల్లో 28 పరుగులు చేశాడు. శివమ్ దూబే 22 పరుగులు, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 20 పరుగులు, తిలక్ వర్మ 5 పరుగులు, కీపర్ జితేష్ శర్మ 3 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 12 పరుగులు చేయగా.. అర్ష్ దీప్ సింగ్ డకౌట్‌గా నిలిచాడు. అక్షర్ పటేల్ 21*, వరుణ్ చక్రవర్తి 1* పరుగుతో నాటౌట్‌గా నిలిచారు. ఇక ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎల్లీస్ 3 వికెట్లు, స్టాయినీస్ 1 వికెట్, ఆడమ్ జంపా 3 వికెట్లు, బార్టిలెట్ 1 వికెట్ తీశారు. 

మొదట టాస్ గెలిచిన ఆసీస్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ దిగారు. మొదటి నుంచి అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. ఇద్దరూ కలిసి పరుగులు బాగా రాబట్టారు. అయితే ఆడమ్‌ జంపా బౌలింగ్‌లో 6.4 ఓవర్‌కు అభిషేక్‌ శర్మ (28) ఔటయ్యాడు. అనంతరం గిల్, దూబే అద్బుతమైన ప్రదర్శన ఇచ్చారు. 

శివమ్‌ దూబే.. ఆడమ్‌ జంపా బౌలింగ్‌లో కళ్లు చెదిరే సిక్స్‌ బాదాడు. అనంతరం భారత్ 88 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. నాథన్‌ ఎల్లిస్‌ బౌలింగ్‌లో శివమ్‌ దూబే (22) బౌల్డ్‌ అయ్యాడు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా అతి తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరారు. ఇలా మొత్తంగా భారత్ 167 పరుగులు చేసింది. మరి ఈ టార్గెట్ పూర్తి చేసి ఆసీస్ టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంటుందా? లేదా? అనేది చూడాలి. 

Also Read :  అర్ష్‌దీప్‌ను అందుకే పక్కన పెట్టాం: టీమిండియా బౌలింగ్ కోచ్ సంచలన వ్యాఖ్యలు

Advertisment
తాజా కథనాలు