Jeff Bezos : అట్టహాసంగా అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ పెళ్లి... కాలుష్యం పెరిగిందన్న నిరసనకారులు

ప్రపంచ కుబేరుల్లో ఒకరు, అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌  వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. 61 ఏళ్ల వయసులో తన ప్రియురాలు లారెన్ శాంచెజ్ ను పెళ్లి చేసుకున్నారు. ఇటలీలోని సుందరనగరమైన వెనిస్‌లో గల లాగూన్‌ ఐలాండ్‌లో అట్టహాసంగా ఈ వేడుక జరిగింది.

New Update
Jeff Bezos marrige

Jeff Bezos marrige

ప్రపంచ కుబేరుల్లో ఒకరు, అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌  వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. 61 ఏళ్ల వయసులో తన ప్రియురాలు మాజీ న్యూస్ యాంకర్ లారెన్ శాంచెజ్  ను పెళ్లి చేసుకున్నారు. ఇటలీలోని సుందరనగరమైన వెనిస్‌లో గల లాగూన్‌ ఐలాండ్‌లో శుక్రవారం మధ్యాహ్నం అట్టహాసంగా ఈ వేడుక జరిగింది.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంపన్నులు, ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. అయితే, ఒకవైపు ఈ పెళ్లి వేడుక కళ్లు చెదిరే రీతిలో సాగుతుంటే, మరోవైపు నిరసనకారుల ఆందోళనలతో వెనిస్ నగరం హోరెత్తింది. "రాజులు వద్దు, బెజోస్ వద్దు" అని ఆకుపచ్చ నియాన్ లైట్లతో ప్రొజెక్ట్ చేశారు. "సంపన్నులపై పన్ను విధించండి" అంటూ కాలువల పక్కన ప్లకార్డులు ప్రదర్శించారు. 

Also Read: భారీ వరదలు.. వందల మంది గల్లంతు.. ఒకే కుటుంబంలో 18మంది!

Jeff Bezos Wedding

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంకా, ఆమె భర్త జారెడ్‌ కుష్నెర్‌, ప్రముఖ జర్నలిస్ట్‌ ఓప్రా విన్‌ఫ్రే, కిమ్‌ కర్దాషియన్‌, కోలే కర్దాషియన్‌, జోర్డాన్‌ రాణి రనియా తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు.ఇటలీ లోని చారిత్రక సెయింట్ మార్క్స్ స్క్వేర్‌కు ఎదురుగా ఉన్న శాన్ జార్జియో మాగ్గియోర్ ద్వీపంలో ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అక్కడి విశాలమైన ఓపెన్-ఎయిర్ యాంఫి థియేటర్‌లో బ్లాక్-టై థీమ్‌తో పెళ్లి వేడుకను నిర్వహించారు. ప్రముఖ ఒపెరా గాయకుడు ఆండ్రియా బోసెల్లి కుమారుడు మాటియో బోసెల్లి తన గానంతో నూతన వధూవరులను, అతిథులను అలరించారు. మిషెలిన్-స్టార్ చెఫ్ ఫాబ్రిజియో మెల్లినో పెళ్లి విందును సిద్ధం చేయగా, ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ పేస్ట్రీ చెఫ్ సెడ్రిక్ గ్రోలెట్ కేక్‌ను తయారు చేశారు.

Also Read :  పూరీ జగన్నాథ్ రథయాత్రలో 500 మంది భక్తులకు గాయాలు

జెఫ్‌ బెజోస్‌ , లారెన్‌ 2018 నుంచే డేటింగ్‌లో ఉన్నారు. 2019 వరకు ఆ విషయం బయటకు రాలేదు. అదే ఏడాది బెజోస్‌ తన భార్య మెకంజీ స్కాట్‌తో ఉన్న 25 ఏళ్ల బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులు తీసుకున్నాడు. మెకంజీతో ఆయనకు నలుగురు సంతానం ఉన్నారు. 2023లో బెజోస్‌, లారెన్‌ నిశ్చితార్థం చేసుకున్నట్లు వార్తలొచ్చాయి. ఈసందర్భంగా 2.5 మిలియన్‌ డాలర్ల విలువైన వజ్రాల ఉంగరాన్ని అమెజాన్‌ అధిపతి ఆమెకు ఇచ్చినట్లు కథనాలు వెలువడ్డాయి. లారెన్‌ గతంలో జర్నలిస్టుగా పని చేశారు. ప్రస్తుతం ఆమె దాతృత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. 

Also Read: కోల్‌కతా గ్యాంగ్‌ రేప్‌ ఘటన.. వెలుగులోకి సంచలన నిజాలు

ఈ వేడుక కోసం దాదాపు 95 ప్రైవేట్ జెట్లు, మెగా యాట్‌లు నగరానికి రావడం వల్ల కర్బన ఉద్గారాలు పెరిగిపోతున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. పర్యాటకుల తాకిడితో ఇప్పటికే సతమతమవుతూ, నెమ్మదిగా కుంగిపోతున్న వెనిస్ నగరంపై ఇలాంటి వేడుకలు మరింత భారం మోపుతాయని వారు ఆరోపించారు.ఈ వివాహం ద్వారా వెనిస్‌కు దాదాపు ఒక బిలియన్ యూరోల (దాదాపు రూ. 9,100 కోట్లు) ఆదాయం వస్తుందని, అందులో 895 మిలియన్ యూరోలు మీడియా ప్రచారం వల్లనే సమకూరుతుందని ఇటలీ పర్యాటక మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. మరోవైపు జెఫ్ బెజోస్ నగరానికి 3 మిలియన్ యూరోలు విరాళంగా ఇవ్వడంతో పాటు స్థానిక కళాకారులకు ఉపాధి కల్పిస్తున్నారని వెనెటో ప్రాంతీయ అధ్యక్షుడు లూకా జయా తెలిపారు. ఇవాళ‌ నగరంలోని చారిత్రక నౌకాశ్రయమైన ఆర్సెనేల్‌లో జరిగే పార్టీతో ఈ మూడు రోజుల వేడుకలు ముగియనున్నాయి.

Also Read :  Constable Kanakam web Series: కానిస్టేబుల్ కనకంగా అదరగొట్టిన వర్ష బొల్లమ్మ.. !

 

itali | marrige | amazon founder | amazon-ceo | amazon | Jeff Bezos Marriage | jeff-bezos

Advertisment
Advertisment
తాజా కథనాలు