IND U19 vs ENG U 19 : కోహ్లీ జెర్సీలో చితకబాదిన సూర్యవంశీ.. ఇంగ్లాండ్‌ చిత్తు చిత్తు

ఇంగ్లాండ్ అండర్ 19తో జరిగిన మ్యాచ్‌లో యంగ్ ఇండియా ఘన విజయం సాధించింది. వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో భారత జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో అత్యధికంగా 48 పరుగులు చేశాడు.

New Update
IND U19 vs ENG U 19

IND U19 vs ENG U 19

ఇంగ్లాండ్ అండర్ 19 Vs ఇండియా అండర్ 19 మధ్య 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగుతోంది. తొలి మ్యాచ్ జూన్ 27న జరగగా.. ఈ మ్యాచ్‌లో యంగ్ ఇండియా ఘన విజయం సాధించింది. వైభవ్ సూర్యవంశీ చితకబాదేశాడు. వైభవ్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో భారత జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 

Also Read: భారీ వరదలు.. వందల మంది గల్లంతు.. ఒకే కుటుంబంలో 18మంది!

IND U-19 vs ENG U-19

వైభవ్‌తో పాటు అభిజ్ఞాన్ కుండు తోడవడంతో యంగ్ ఇండియా ఘన విజయం సాధించింది. వీరిద్దరు తప్పించి భారత బ్యాట్సమెన్లలో ఇంకెవరూ మంచి పెర్ఫార్మెన్స్ చేయలేదు. ఇక బౌలింగ్‌లో కనిష్క చౌహాన్ అత్యధిక వికెట్లు పడగొట్టాడు.  

ఇంగ్లాండ్ అండర్ 19 జట్టు మొదట బ్యాటింగ్ చేసి 174 పరుగులు చేసింది. ఓపెనర్ బిజె డౌఫిన్స్ 18 పరుగులు.. ఐజాక్ మొహమ్మద్ 28 బంతుల్లో 42 పరుగులు చేశాడు. అలాగే రాకీ ఫ్లింటాఫ్ అత్యధిక పరుగులు రాబట్టాడు. అతడు 90 బంతుల్లో 56 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో కనిష్క చౌహాన్ అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు. 

Also Read: కోల్‌కతా గ్యాంగ్‌ రేప్‌ ఘటన.. వెలుగులోకి సంచలన నిజాలు

Also Read :  జపాన్‌లో ‘ట్విటర్‌ కిల్లర్‌’ కు ఉరి

అనంతరం 175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 24 ఓవర్లలోనే విజయం సాధించింది. భారత్ తరఫున వైభవ్ సూర్యవంశీ 19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో అత్యధికంగా 48 పరుగులు చేశాడు. దీంతో పాటు అభిజ్ఞాన్ కుండు 34 బంతుల్లో 45 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రాహుల్ కుమార్ 25 బంతుల్లో 17 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ తరఫున ఎంఎం ఫ్రెంచ్ 2 వికెట్లు పడగొట్టాడు. 

Advertisment
తాజా కథనాలు