/rtv/media/media_files/2025/04/03/3MMxfEUm9mdX7YKRWTRw.jpg)
shikhar dhawan gf
తాను రిలేషన్‌లో ఉన్నట్లుగా టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ వెల్లడించాడు. అయితే ఆమె పేరును మాత్రం ప్రస్తావించలేదు. కానీ ప్రపంచంలో అత్యంత అందమైన అమ్మాయి ఆమేనంటూ వ్యాఖ్యనించాడు. జర్నలిస్ట్ నావికా కుమార్ తో జరిగిన సంభాషణలో తన రిలేషన్ ను ధావన్ ధృవీకరించాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా శిఖర్ ధావన్ ఓ అమ్మాయితో కనిపించగా ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read : AP Registrations : రిజిస్ట్రేషన్లపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
Also Read : KTR : ఆ 400 ఎకరాలు ఎవరు కొన్నా వెనక్కి తీసుకుంటాం..కేటీఆర్ సంచలన ప్రకటన!
ఆయేషా ముఖర్జీతో పెళ్లి, విడాకులు
ఆ అందెగత్తె ఐర్లాండ్‌కు చెందిన సోఫీ షైన్ అని తెలుస్తోంది. ధావన్ ఆమె పేరు చెప్పనప్పటికీ.. ఆమే తన గర్ల్‌ఫ్రెండ్ అంటూ పరోక్షంగా ఒప్పుకున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ధావన్, సోఫీ షైన్ కలిసి కనిపించడం ఇదే మొదటిసారి కాదు. 2024 నవంబర్ లో వారిద్దరూ ఓ విమానాశ్రయంలో కనిపించారు, దీంతో వీరిద్దరి డేటింగ్ ఊహాగానాలకు ఆజ్యం పోసింది. కాగా 39 ఏళ్ల ధావన్ 2023 అక్టోబర్ లో తన మాజీ భార్య ఆయేషా ముఖర్జీ నుండి విడాకులు తీసుకున్నారు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ఆయేషాకు ధావన్‌తో జరిగింది రెండవ వివాహం. ఆయేషా మొదటి వివాహం ఆస్ట్రేలియాకు చెందిన వ్యాపారవేత్తతో జరిగింది.
Hahahha such a cute video 😆😆😆 #ShikharDhawanpic.twitter.com/P0PSrC9ydc
— Prernaa (@theprernaa) February 21, 2025
Also Read : నిజమైన స్నేహితుడు అయితే ఇలా చేయడు...ట్రంప్ సుంకాల పై వివిధ దేశాధినేతలు!
shikhar-dhawan | relationship | Sophie Shine | latest-telugu-news | today-news-in-telugu | telugu-sports-news | telugu-cricket-news