KTR : ఆ 400 ఎకరాలు ఎవరు కొన్నా వెనక్కి తీసుకుంటాం..కేటీఆర్ సంచలన ప్రకటన!

మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. మూడేళ్లలో తాము అధికారంలోకి రాగానే  HCUకి చెందిన 400 ఎకరాల భూమిని అతిపెద్ద ఈకో పార్క్ లాగా మారుస్తామని అన్నారు.  ఆ 400 ఎకరాల భూమిలో ఎవరు ఇంచు కొనుకున్నా తిరిగి వెనక్కి తీసుకుంటామని తెలిపారు

New Update
K. T. Rama Rao

K. T. Rama Rao

మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. కంచ గచ్చిబౌలి భూములను ఎవరూ కొనద్దని కోరారు.  ఒకవేళ కొన్నా తాము అధికారంలోకి రాగానే వాటిని వెనక్కి తీసుకుంటామని చెప్పారు.   ఆ 400 ఎకరాలు ఎవరు కొన్నా నష్టపోతారని చెప్పారు. భూముల వ్యవహారంపై తెలంగాణ భవన్‌లో గురువారం కేటీఆర్‌ ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. మూడేళ్లలో తాము అధికారంలోకి రాగానే  HCUకి చెందిన 400 ఎకరాల భూమిని అతిపెద్ద ఈకో పార్క్ లాగా మారుస్తామని అన్నారు. 

Also read :  అంత రెమ్యూనరేషన్‌కే ఇంత రెచ్చిపోవాలా.. బిగ్ బాస్ బ్యూటీని ఊతికారేస్తున్న నెటిజన్లు!

వెనక్కి తగ్గకపోతే పోరాటం చేస్తాం 

పచ్చని చెట్లను నరకొద్దని విద్యార్థులు నిరసనలు చేస్తుంటే, మంత్రులు వాళ్లకు దైర్యం ఇవ్వాల్సింది పోయి వాళ్ళని గుంట నక్కలు, పెయిడ్ ఆర్టిస్టులు అని అవమానపరుస్తున్నారంటూ మండిపడ్డారు.  పేరుకే ప్రజాపాలన, ఎక్కడా ప్రజాస్వామ్య స్ఫూర్తి కనిపించడం లేదని కేటీఆర్ విమర్శించారు. తాము అధికారంలో ఉండగా..  హైదరాబాద్ కు గ్రీన్ సిటీ అవార్డు వచ్చిందని... కోట్ల మొక్కలు నాటి హరిత విప్లవానికి తెరలేపామన్నారు కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వ భూమి అయితే దొంగలాగా ఎందుకు పోతున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రభుత్వ భూములు ప్రజలవని.. సీఎం ధర్మకర్త మాత్రమేనని చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే పోరాటం చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. ఇది హైదరాబాద్ భవిష్యత్తు కోసం చేస్తున్న పోరాటమని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

Also read : Bird Flu: తెలంగాణలో బర్డ్ ఫ్లూ కలకలం..300 కోళ్లు మృతి.. కోడిగుడ్లు కూడా!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు