DC vs RCB: పీకల్లోతు కష్టాల్లో ఢిల్లీ క్యాపిటల్స్.. 10 ఓవర్లకు 3 వికెట్లు డౌన్ - స్కోర్ ఎంతంటే?

ఆర్సీబీతో జరుగుతోన్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 10 ఓవర్లు పూర్తి చేసుకుంది. ఈ పది ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. క్రీజ్‌లో కేఎల్ రాహుల్ 16*, అక్షర్ పటేల్ 0* ఉన్నారు. 

New Update
DC vs RCB

DC vs RCB


ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ VS రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరుగుతోంది. ఇందులో భాగంగానే టాస్ గెలిచిన బెంగళూరు జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ జట్టు తాజాగా 10 ఓవర్లు పూర్తి చేసుకుంది. ఈ పది ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి పరుగులు చేసింది. రాహుల్ 16*, అక్షర్ పటేల్ 0* ఉన్నారు.

Also Read: భారీ పేలుడు.. 25 మంది స్పాట్ డెడ్ -1,139 మందికి తీవ్ర గాయాలు

Also Read: ఇంటిలిజెన్స్ కీలక సమాచారం.. ఢిల్లీలో 5వేల మంది పాకిస్తానీలు

DC Vs RCB

 క్రీజులోకి వచ్చిన ఢిల్లీ ఓపెనర్లు అభిషేక్‌ పోరెల్‌, డుప్లెసిస్‌ మొదటి నుంచి దూకుడుగా ఆడారు. కానీ ఓపెనర్ అభిషేక్‌ పోరెల్‌ క్రీజులో ఎక్కువ సమయం నిలబడలేకపోయాడు. జోష్‌ హేజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో పోరెల్‌ (28) ఔట్‌ అయ్యాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కరుణ్ నాయర్ మరుసటి ఓవర్‌లోనే పెవిలియన్‌కు చేరాడు. నాయర్‌ (4) ఔట్‌ అయ్యాడు. దీంతో 5 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 45 పరుగులు సాధించారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్, డుప్లెసిస్ మెల్లి మెల్లిగా పరుగులు రాబట్టారు.

Also Read: కేంద్రం కీలక నిర్ణయం.. NIA చేతికి పహల్గాం ఉగ్రదాడి కేసు

ఆచితూచి ఆడుతున్న సమయంలో మరో బిగ్ షాక్ తగిలింది. డుప్లెసిస్‌ (22) ఔట్‌ అయ్యాడు. కృనాల్‌ పాండ్య వేసిన 9.5 ఓవర్‌లో విరాట్‌ కోహ్లీకి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఢిల్లీ జట్టు 10 ఓవర్లకు 3 వికెట్లు నష్టపోయి 72 పరుగులు మాత్రమే చేసింది. గత మ్యాచ్‌లతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ స్కోర్ అనే చెప్పాలి. చూడాలి మరి ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్న రాహుల్, అక్షర్ మ్యాజిక్ ఏమైనా చేస్తారా? లేదా?

Also Read: స్టూడెంట్స్తో బలవంతంగా నమాజ్ .. ఏడుగురు టీచర్లపై కేసు!

telugu-news | IPL 2025 | sports | latest-telugu-news | dc vs rcb

Advertisment
Advertisment
తాజా కథనాలు