Abhishek Sharma : చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు

ఆసియాకప్ లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో  టీమిండియా ఆటగాడు అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ లో 25 ఏళ్ల అభిషేక్ 13 బంతుల్లో నాలుగు బౌండరీలు, రెండు సిక్సర్లతో 31 పరుగులు చేశాడు.

New Update
abhishek

ఆసియాకప్ లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో  టీమిండియా ఆటగాడు అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ లో 25 ఏళ్ల అభిషేక్ 13 బంతుల్లో నాలుగు బౌండరీలు, రెండు సిక్సర్లతో 31 పరుగులు చేశాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ రికార్డును అభిషేక్ బద్దలు కొట్టాడు. పవర్‌ప్లేలో అభిషేక్ చేసిన 31 పరుగులు అత్యధిక పరుగులు కావడం విశేషం. మొదటి ఆరు ఓవర్లలో 30 పరుగులు చేసిన తొలి భారత బ్యాట్స్‌మన్ కూడా అతనే. గతంలో ఈ రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉంది. కోహ్లీ 2022లో ఇదే వేదికపై ఈ రికార్డు నెలకొల్పాడు. అదే ఏడాది రోహిత్ శర్మ కూడా 28 పరుగులు రాబట్టాడు. భారత్‌ తరఫున అభిషేక్ టాపర్ కాగా.. ఓవరాల్‌గా మాత్రం పాక్‌ మాజీ ఆటగాళ్లు నసీర్ జంషెడ్ (2012లో 34 రన్స్), ఇమ్రాన్ నజీర్ (2007లో 33 పరుగులు) ఈ లిస్టులో ముందున్నారు.  ఈ ఏడాది ప్రారంభంలో ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్‌పై 135 పరుగులు చేసిన అభిషేక్, టీ20 ఇన్నింగ్స్‌లో పవర్‌ప్లేలో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 

హై-వొల్టేజ్ మ్యాచ్‌లో భారత్ విజయం

ఇక మ్యాచ్ విషయానికి వస్తే..  ఈ హై-వొల్టేజ్ మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.పాకిస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లు కుల్దీప్ యాదవ్ (3/18),  అక్షర్ పటేల్ (2/18) అద్భుత ప్రదర్శన చేశారు. భారత్ కేవలం 15.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (47 నాటౌట్), తిలక్ వర్మ (31), ఓపెనర్ అభిషేక్ శర్మ (31) బ్యాటింగ్‌లో రాణించారు. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చేసిన కుల్దీప్ యాదవ్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. పాకిస్తాన్‌పై విజయం సాధించడంతో, భారత్ గ్రూప్ A లో రెండు విజయాలతో అగ్రస్థానంలో నిలిచి సూపర్ 4 రౌండ్‌కు అర్హత సాధించింది. పాకిస్తాన్ కూడా రెండు మ్యాచ్‌లలో ఒక గెలుపు, ఒక ఓటమితో సూపర్ 4కు చేరుకుంది. గ్రూప్ B లో ఆఫ్ఘనిస్తాన్,  శ్రీలంక జట్లు కూడా సూపర్ 4కు అర్హత సాధించినట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచ కప్ 2024 తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మరియు రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత, ఈ ముగ్గురు లేకుండా భారత్ ఆసియా కప్‌లో పాల్గొనడం ఇదే మొదటిసారి. టీ20 ఫార్మాట్‌లో జరుగుతున్న ఈ టోర్నమెంట్‌లో యువ జట్టుతో భారత్ బరిలోకి దిగింది. 

Advertisment
తాజా కథనాలు