Saina Nehwal Retirement: ఎప్పుడో ఆడడం మానేసా...ప్రత్యేకంగా రిటైర్మెంట్ అని చెప్పలేదు..సైనా నెహ్వాల్

స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ ఆటకు చాలా రోజులుగా దూరంగా ఉంటున్నారు. దీనిపై అడగ్గా.. 2023 నుంచి మోకాలి నొప్పి కారణంగా తాను ఆడడం లేదని..ఇక మీదట కూడా ఆడనని చెప్పారు. 

New Update
saina

Saina Nehwal Retirement

Saina Nehwal Retirement: అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ తన రిటైర్మెంట్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మూడేళ్ల క్రితమే ఆడడం మానేసానని..కానీ ప్రత్యేకంగా రిటైర్మెంట్ ప్రకటించలేదని అన్నారు. అలా చేయాల్సిన అవసరం కూడా కనిపించలేదని అన్నారు. ఆట ఆడేంత సామర్థ్యం లేనప్పుడు ఆగిపోవడం మంచిదని సైనా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రెండేళ్ళుగా ఆటకు దూరంగా ఉన్న సైనా తాజాగా పాడ్ కాస్ట్ లో మాట్లాడారు. మోకాలి సమస్యతో బాధపడుతున్నానని..శారీరకంగా ఆటకు సహకరించనప్పుడు దూరంగా ఉండటమే మంచిదని చెప్పారు. 

ఆడటం, ఆడకపోవడం పూర్తిగా నాదే నిర్ణయం..

నాకు ఇష్టం కాబట్టే బ్యాడ్మింటన్ ఆటలోకి వచ్చాను. ఇప్పుడు అవడం లేదు కాబట్టే దూరంగా ఉంటున్నాను. అందుకే రిటైర్మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పలేదని సైనా నెహ్వాల్ చెప్పారు. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన సైనా.. చివరిసారిగా 2023లో సింగపూర్‌ ఓపెన్‌లో ఆడారు. ఈ నిర్ణయానికి రావడం వెనుక చాలా అంశాలు పాత్ర వహించాయని తెలిపారు. మోకాలి నొప్పి సమస్యగా మారడంతో వెనకడుగు వేశా. ఈ విషయం నా కోచ్‌కు తెలియాలి. నా తల్లిదండ్రులకు తెలియాలి. అందుకే వాళ్ళకు చెప్పా. అంతకు మించి మరేమీ చేయలేదని స్పష్టం చేశారు. కానీ నన్ను ఫాలో అయ్యే వారికి ఇప్పటికే ఇది అర్ధం అయిపోయి ఉంటుంది. సైనా ఆడటం లేదని నెమ్మదిగా తెలుసుకుంటారు. నా వీడ్కోలు అనేది పెద్ద విషయమేమీ కాదని నా భావన అని అన్నారు సైనా. 

సైనా నెహ్వాల్ భారత మహిళా బ్యాడ్మింటన్‌లో మొదటి సూపర్ స్టార్‌ అని చెప్పొచ్చు. రెండుసార్లు ఆమె కామన్వెల్త్‌ చాంపియన్‌గా నిలిచారు. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలుచుకుని.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. 2015లో మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌ 1 ర్యాంక్‌ సాధించారు. భారత్ నుంచి ఈ ఫీట్ సాధించిన తొలి ప్లేయర్‌గా నిలిచారు. 2018లో మరో బ్యాడ్మింటన్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ ను పెళ్ళి చేసుకున్నారు. అయితే ఏడేళ్ళ తర్వాత 2025 వారిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. 2025 జూలై 13న సైనా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించారు.  దీంతో సైనా నెహ్వాల్ పేరు గూగుల్‌లో ట్రెండ్ అయ్యింది.

Advertisment
తాజా కథనాలు