/rtv/media/media_files/2026/01/21/t20-team-2026-01-21-09-14-03.jpg)
టీ20 వరల్డ్ కప్ ముందు భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న టీ20 సిరీస్..చివరి, ప్రధాన సన్నాహక మ్యాచ్ లని చెప్పవచ్చును. ఇప్పటికే సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ లలో వైట్ వాష్, న్యూజిలాండ్ తో వన్డేల్లో ఓడిపోయిన టీమ్ ఇండియా ఘోరమైన పరిస్థితుల్లో ఉంది. దానికి తోడు టీ20 కెప్టెన్ సర్యకుమార్ యాదవ్ పేవలమైన ఫామ్ మరింత భయపెడుతోంది. ఇలాంటి టైమ్ లో భారతజట్టు కోలకుకోవడానికి ఉన్న ఒకే ఒక్క అవకాశం న్యూజిలాండ్ తో జరిగే టీ20 సీరీస్. ఈరోజు నుంచి ప్రారంభమయ్యే ఈ సీరీస్ లో టీమ్ ఇండియా తమ వీక్ నెస్ లన్నింటినీ అధిగమించాలి. టీ20 వరల్డ్ కప్ కు సన్నద్ధమవ్వాలి. కీవీస్ తో టీ20 సీరస ఈ రోజు జనవరి 31 వరకు జరగనున్నాయి. మొత్తం ఐదు మ్యాచ్ లను ఆడనున్నారు. ఫిబ్రవరి 7 నుంచి ప్రపంచ కప్ మొదలవుతుంది.
ప్రపంచ కప్ ప్రాక్టీస్ మ్యాచ్‌ల షెడ్యూల్ ప్రకటించలేదు. అందువల్ల ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్ రెండు జట్లకు సిద్ధం కావడానికి చివరి అవకాశం. భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌లో తన దూకుడు బ్యాటింగ్ శైలిని తిరిగి చూపించాలని ఆశిస్తున్నాడు. భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్ బుధవారం నాగ్‌పూర్‌లో జరుగుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. 2024లో టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి...టీమ్ ను అద్భుతంగా నడిపించాడు. 72శాతానికి పైగా మ్యాచ్ లు గెలిచారు. అయితే గత కొంత కాలంగా ఇతని సొంత బ్యాటింగ్ చాలా పాడైపోయింది. వరుసగా ప్రతీ మ్యాచ్ లో వైఫల్యం చెందుతూ వస్తున్నాడు.
టీ20ల్లో బాగానే రాణిస్తున్నా..
మరోవైపు టెస్ట్ లు, వన్డేల్లో భారత జట్టు పేలవమైన ప్రదర్శన కనబరుస్తున్నా...టీ20ల్లో మాత్రం జట్టు ముందంజలోనే ఉంది. 2024 టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత భారత్ ఈ ఫార్మాట్లో ఒక్క సిరీసూ ఓడిపోలేదు. ఇదే ఊపులో కివీస్‌నూ ఓడించి పొట్టి ప్రపంచకప్‌నకు ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. శస్త్రచికిత్స కారణంగా ఈ సిరీస్‌కు తిలక్ వర్మ దూరం కావడంతో శ్రేయస్ అయ్యర్‌కు జట్టులో చోటు దక్కింది. మూడేళ్లకు పైగా టీ20ల్లో ఆడని శ్రేయస్..ఇప్పుడు ఎలా ఆడతాడో చూడాలి. మరోవైపేు అభిషేక్ శర్మ మీదనే అన్ని ఆశలూ ఉన్నాయి. అతని విధ్వంసకర బ్యాటింగ్ తో జట్టుకు పునాదిగా నిలబడతాడని అశిస్తున్నారు. అభిషేక్‌తో కలిసి సంజు శాంసన్ ఇన్నింగ్స్‌ను ఆరంభించనున్నాడు. అతను మంచి లయలోనే ఉన్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో అదరగొట్టి జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్ మూడో స్థానంలో బరిలో దిగనున్నాడు.
ఇక మిడిల్ ఆర్డర్ లో హర్దిక్ పాండ్యా పెద్ద బలం. అనితో పాటూ మరో ఆల్ రౌండర్ శివమ్ దూబే కూడా తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. వీళ్లిద్దరూ బౌలింగ్‌లోనూ కీలకమే. నాగ్‌పుర్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలం కాబట్టి బుమ్రా ఒక్కడే తుది జట్టులో స్పెషలిస్టు పేసర్‌గా ఉండొచ్చు. అక్షర్ పటేల్‌కు తోడు కుల్‌దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి స్పిన్ బాధ్యతలు పంచుకుంటారు. వన్డేల్లో తేలిపోయిన బౌలింగ్...ఇప్పుడు టీ20ల్లో అయినా మెరుగుపర్చుకుని ఆడాలి. అలా అయితేనే ఈ సీరీస్ తో పాటూ ప్రపంచ కప్ ల కూడా టీమ్ ఇండియా రాణింగలుగుతుంది.
Also Read: India-EU: ప్రపంచ వాణిజ్యాన్ని మార్చే దిశగా..భారత్, ఈయూల మధ్య కీలక ఒప్పందం..
Follow Us