PM Modi : పుజారా రిటైర్మెంట్.. ప్రధాని మోదీ అభినందన లేఖ

టీమిండియా క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుజారాకు ఒక లేఖ రాసి అభినందనలు తెలిపారు.

New Update
pujara

టీమిండియా(Team India) క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుజారాకు ఒక లేఖ రాసి అభినందనలు తెలిపారు. ఈ లేఖను పుజారా సోషల్ మీడియాలో పంచుకున్నారు.

"షార్టర్ ఫార్మాట్ క్రికెట్ (T20, వన్డేలు) ప్రాబల్యం పెరిగిన ఈ రోజుల్లో కూడా, మీరు టెస్ట్ క్రికెట్ అందాన్ని గుర్తుచేశారు. మీ స్థిరమైన నైజం, అసాధారణ ఏకాగ్రతతో ఎక్కువ సేపు బ్యాటింగ్ చేసే మీ సామర్థ్యం భారత బ్యాటింగ్ లైనప్‌కు ప్రధాన బలంగా నిలిచింది.  మీరు సాధించిన సెంచరీలు, డబుల్ సెంచరీలు, విజయాలు కేవలం సంఖ్యల ద్వారా కొలవలేనివి. మీ ఉనికి అభిమానులకు, సహచరులకు టీమ్ సురక్షితమైన చేతుల్లో ఉంది అనే ఒక ప్రశాంతమైన భావనను కలిగించింది. ఇదే మీ నిజమైన, సంఖ్యలకు మించిన వారసత్వం అని మోదీ లేఖలో తెలిపారు.  మోదీ తన లేఖలో పుజారా తండ్రి, భార్య, కూతురును కూడా అభినందించారు. వారు పుజారా కెరీర్‌కు ఎంతో సహకరించారని ప్రశంసించారు.  

Also Read : తల్లి వివాహేతర సంబంధం.. ఇనుపరాడ్డుతో కొట్టి చంపిన కొడుకు

ప్రధాని మోదీకి కృతజ్ఞతలు

ఈ సందేశాన్ని పుజారా(Pujara) తన సోషల్ మీడియా ఖాతాలో ప్రధాని మోదీ(pm modi) కి కృతజ్ఞతలు తెలిపారు. "మా గౌరవనీయ ప్రధానమంత్రి గారి నుంచి నా రిటైర్మెంట్ సందర్భంగా ప్రశంసా పత్రాన్ని అందుకోవడం నాకు చాలా గౌరవం. ఈ లేఖలో ఆయన వ్యక్తం చేసిన ఆప్యాయత ఎంతో విలువైనది" అని పుజారా పేర్కొన్నారు. ఈ లేఖ పుజారా క్రికెట్ ప్రస్థానంలో ఒక గొప్ప మైలురాయిగా నిలిచింది.

103 టెస్టుల్లో 7000 పైగా పరుగులు

పుజారా తన కెరీర్‌లో టెస్ట్ క్రికెట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. టీ20, వన్డేల హవా నడుస్తున్న సమయంలో కూడా టెస్టుల్లో ఎక్కువసేపు క్రీజ్‌లో నిలబడి బ్యాటింగ్ చేయగల సత్తా ఆయన సొంతం. భారత జట్టుకు ఓపెనర్‌గా, కీలకమైన నెంబర్ 3 బ్యాట్స్‌మన్‌గా ఆయన ఎన్నో మ్యాచుల్లో విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పారు.2010లో ఆస్ట్రేలియాపై అరంగేట్రం చేసిన పుజారా, 103 టెస్టుల్లో 7000 పైగా పరుగులు సాధించారు. ఇందులో 19 సెంచరీలు, 3 డబుల్ సెంచరీలు ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ, దేశవాళీ క్రికెట్‌లో సౌరాష్ట్ర తరఫున ఆడటం కొనసాగిస్తానని పుజారా తెలిపారు.

Also Read : UPSC అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. కేంద్రం కీలక నిర్ణయం

Advertisment
తాజా కథనాలు