Team India New Sponsorship: టీమిండియాకు భారీ కొత్త స్పాన్సర్.. ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ కావాల్సిందే!

సుమారుగా రూ.452 కోట్ల భారీ ఆదాయం వచ్చేలా బీసీసీఐ టీమిండియా కొత్త స్పాన్సర్ కోసం చూస్తోంది. ప్రతి ద్వైపాక్షిక మ్యాచ్‌కు రూ. 3.5 కోట్లు, ఐసీసీ, ఏసీసీ వంటి పెద్ద టోర్నమెంట్‌లో జరిగే మ్యాచ్‌లకు రూ.1.5 కోట్లు చొప్పున స్పాన్సర్‌షిప్ ఫీజును నిర్ణయించింది.

New Update
Dream 11

Dream 11

పార్లమెంట్‌లో ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు ఆమోదం పొందడంతో టీమిండియాకు ప్రధాన స్పాన్సర్‌గా ఉన్న డ్రీమ్ 11 ఒప్పందాన్ని గడువుకు ముందే రద్దు చేసుకోవాల్సి వచ్చింది. అయితే బీసీసీఐ టీమిండియా స్పాన్సర్ కోసం ప్రయత్నిస్తోంది. ఎందుకంటే సెప్టెంబర్ 9వ తేదీ నుంచి ఆసియా కప్ 2025 ప్రారంభం కానుంది. దీని కంటే ముందే కొత్త స్పాన్సర్‌ను కనుగొని, ముందే జెర్సీలను ముద్రించాలి. ఈ క్రమంలో బీసీసీఐ కొత్త స్పాన్సర్ కోసం ఎదురు చూస్తోంది. ఈ ఏడాది నుంచి 2028 వరకు టీమిండియా  జెర్సీలకు కొత్త స్పాన్సర్ కావాలి. దాదాపుగా 140 మ్యాచ్‌ల  కోసం కొత్త స్పాన్సర్‌ను బీసీసీఐ చూస్తోంది. అయితే గతంలో డ్రీమ్ 11 రూ.358 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కంటే ఎక్కువగా కొత్త ఒప్పందం ఉండేలా బీసీసీఐ ప్లాన్ చేస్తోంది.

ఇది కూడా చూడండి: Asia Cup 2025: క్రికెట్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ఆసియా కప్ షెడ్యూల్‌లో మార్పు.. కారణమిదే!

కొత్త రేట్లను నిర్ణయించిన బీసీసీఐ..

సుమారుగా రూ.452 కోట్ల భారీ ఆదాయం వచ్చేలా బీసీసీఐ కొత్త స్పాన్సర్ కోసం చూస్తోంది. అయితే ఈ కొత్త స్పాన్సర్‌షిప్ ఒప్పందాన్ని మరింత లాభదాయకంగా మార్చడానికి బీసీసీఐ కొన్ని కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. ప్రతి మ్యాచ్‌కు రూ. 3.5 కోట్లు నిర్ణయించింది. అలాగే ఐసీసీ, ఏసీసీ వంటి పెద్ద టోర్నమెంట్‌లో మ్యాచ్‌లు జరిగితే వాటికి రూ.1.5 కోట్లు చొప్పున స్పాన్సర్‌షిప్ ఫీజును బీసీసీఐ నిర్ణయించింది. డ్రీమ్ 11 చెల్లించిన దానికంటే భారీగా ఈ కొత్త రేట్లను ప్రకటించింది. అయితే స్పాన్సర్‌షిప్ ఒప్పందం కేవలం దేశీయ, విదేశీ మ్యాచ్‌లకు మాత్రమే కాకుండా ఏసీసీ, ఐసీసీ నిర్వహించే అన్ని అంతర్జాతీయ టోర్నమెంట్‌లకు కూడా వర్తిస్తుంది. ఇది స్పాన్సర్‌గా ఎంపికైన సంస్థకు ప్రపంచవ్యాప్తంగా తమ బ్రాండ్‌ను ప్రమోట్ చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశాన్ని అందిస్తుంది.

ఉన్నది తక్కువ సమయమే..

ఆసియా కప్ ప్రారంభం అవుతుండటంతో కొత్త స్పాన్సర్‌ను వెంటనే ఫిక్స్ చేసుకోవడం బీసీసీఐకి తప్పనిసరి. లేకపోతే జెర్సీలపై స్పాన్సర్ లేకుండానే బరిలోకి దిగాల్సి వస్తుంది. సెప్టెంబర్ 9న ప్రారంభం అయ్యే ఆసియా కప్‌కి కాకపోయిన సెప్టెంబర్ 30న ప్రారంభం కానున్న మహిళల ప్రపంచ కప్‌కు ముందు కచ్చితంగా కొత్త డీల్‌ను ఫైనల్ చేస్తామని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ స్పాన్సర్‌షిప్ కేవలం ఒక వ్యాపార ఒప్పందం మాత్రమే కాదు.. భారత క్రికెట్ ఆర్థిక బలం, దాని బ్రాండ్ విలువకు ఒక పరీక్షగా నిలవనుంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన క్రికెట్ బోర్డుగా ఉన్న బీసీసీఐ ఇప్పుడు స్పాన్సర్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. మరి ఈ కొత్త స్పాన్సర్  ఎవరో చూడాలి. 

ఇది కూడా చూడండి: IPL Rajasthan Royals: రాజస్థాన్ రాయల్స్‌కు ద్రవిడ్ గుడ్ బై.. తప్పుకోవడానికి జట్టులో ఉన్న అతనే కారణమా?

Advertisment
తాజా కథనాలు