/rtv/media/media_files/2025/09/17/pakistan-2025-09-17-20-21-37.jpg)
Pakistan
ఆసియా కప్ 2025(Asia cup 2025) లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత పాక్ జట్టు భారత్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంతో తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( పీసీబీ) ఐసీసీకి ఫిర్యాదు చేసింది. మ్యాచ్ రిఫరీని తొలగించడంతో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. దీనికి చర్యలు తీసుకోకపోతే టోర్నీ నుంచి వైదొలగుతామని బెదిరించింది. ఈ క్రమంలోనే నేడు యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో ఆడకూడదని నిర్ణయించినట్లు జోరుగా ప్రచారం జరిగింది. ఇదంతా కూడా భారత్ జట్టు షేక్ ఇవ్వలేదని పాకిస్తాన్ బాగా హర్ట్ అయ్యి చేసినట్లు తెలింది. కరచాలనం ఇవ్వకపోవడానికి కూడా ముఖ్య కారణం.. పహల్గామ్ ఉగ్రదాడి అని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. అయితే షెడ్యూల్ ప్రకారం పాకిస్థాన్, యూఏఈ జట్లు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ జరగాల్సింది. కానీ గంట సమయం కావాలని పాక్ కోరింది.
ఇది కూడా చూడండి: Jasprit Bumrah: టీమిండియాకు బిగ్ షాక్.. బుమ్రా దూరం - కారణం ఇదే..!
UAE 🇦🇪 Vs Pakistan 🇵🇰 match delayed by 1 hour 😲
— Richard Kettleborough (@RichKettle07) September 17, 2025
- After all the drama of boycott by PCB, still Andy Pycroft remains the match referee 😅
So this means, no one takes PCB seriously, not even ICC and ACC 😆
What's your take on this 🤔 pic.twitter.com/WeD5jXzlCL
ఇది కూడా చూడండి: Asia Cup 2025: షేక్ హ్యాండ్ వివాదం.. పాకిస్తాన్‌కు రూ.454 కోట్లు లాస్!
వెనక్కి తగ్గి వచ్చిన పాక్ జట్టు..
మ్యాచ్ ఆడమని అలిగిన పాక్ జట్టు గంట సమయం కోరుతూ వెనక్కి తగ్గింది. మ్యాచ్ ఆడటానికి రెడీ అయ్యింది. దీంతో రాత్రి 9 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అలాగే మ్యాచ్‌కి రిఫరీగా వ్యవహరించిన ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) కోరింది. కానీ ఈ మ్యాచ్‌కి అతన్నే మళ్లీ రిఫరీగా వ్యవహరించనున్నారు. అయితే పాక్ వెనక్కి తగ్గడానికి ముఖ్య కారణం ఆదాయం రాదని. ఎందుకంటే ఐసీసీపై కోపంతో పాకిస్తాన్ టోర్నీ నుంచి తప్పుకుంటే దాదాపుగా రూ. 454 కోట్లు(16 మిలియన్ల అమెరికా డాలర్లు) ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుంది. షేక్ హ్యాండ్ వివాదం వల్ల పంతాలకు పోతే పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఇంకా దిగజారడం పక్కా. ఇప్పటికే పాకిస్తాన్ ఆర్థికంగా దిగజారిపోయింది. ఇప్పుడు ఈ టోర్నీ నుంచి వైదొలగితే మాత్రం ఆ రూ.454 కోట్లు రావని ఉద్దేశంతో మళ్లీ మ్యాచ్‌కి రెడీ అయినట్లు తెలుస్తోంది.